ఆవనూనె, పామాయిల్‌తో దీపమెలిగించారో.. ఇక అంతే సంగతులు?! (video)

Webdunia
బుధవారం, 15 జులై 2020 (15:40 IST)
రోజూ మనం వెలిగించాల్సిన దీపాల కోసం మనం వినియోగించే నూనెల గురించి తెలుసుకుందాం.. రోజూ ఉదయం లేదా సాయంత్రం పూట దీపారాధన చేయడం మంచిది. దీపారాధన మహిళలే చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది.

సాయంత్రం పూట ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత దీపాన్ని వెలిగించి పూజ చేయాలి. దీపానికి నెయ్యి, వేపనూనె, కొబ్బరి నూనె, ఆముదం వంటి వాటిని కలిపి వెలిగిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. 
 
నేతితో దీపం వెలిగించడం ద్వారా సకల సంతోషాలు చేకూరుతాయి. నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం ద్వారా గృహంలోని ప్రతికూల ఫలితాలు తొలగిపోతాయి. దోషాలుండవు.

ఆముదంతో దీపం వెలిగిస్తే.. కీర్తిప్రతిష్ఠలు చేకూరుతాయి. సిరిసంపదలు చేకూరుతాయి. దారిద్ర్యం తొలగిపోతుంది. ఆవు నేతితో దీపం వెలిగిస్తే దంపతుల మధ్య కలహాలుండవు. అన్యోన్యత పెంపొందుతుంది.

ఇంటి దేవత అనుగ్రహం పొందాలనుకునేవారు ఆముదంతో దీపాలను వెలిగించాలి. వంశవృద్ధికి ఆముదంతో ఇంట దీపం వెలిగించాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 
 
అయితే ఆవనూనె, పామాయిల్, వేరుశెనగల నూనెను దీపారాధానకు ఉపయోగించకూడదు. ఇంట్లోనే కాకుండా ఆలయాల్లో ఈ నూనెను దీపారాధనకు వాడకూడదు. ఈ నూనెలతో దీపమెలిగిస్తే ఇబ్బందులు, ఈతిబాధలు, పాపాలు, దోషాలు తప్పవని ఆధ్యాత్మిక పండితులు హెచ్చరిస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా.. డీకే శివకుమార్‌కు ఆశీస్సులు

భార్య నచ్చలేదు.. భర్తే ఆమెను రూ.50వేలకు స్నేహితులకు అమ్మేశాడు..

నీట్ యూజీ పరీక్ష రద్దు... ఫీజు వాపసు గడువు జూన్ 22కి పెంపు

ఎన్టీఆర్ 103వ జయంతి.. చంద్రబాబు నివాళి.. మహానాడు ఏం టెక్నాలజీ గురూ..

హైదరాబాద్ నగర నడిబొడ్డున ఎన్టీఆర్ భారీ కాంస్య విగ్రహం

అన్నీ చూడండి

లేటెస్ట్

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

తర్వాతి కథనం
Show comments