Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుభోదయం : మీ రాశి ఫలితాలు 20-08-17

మేషం : వృత్తి, ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వివాహం కానివారు శుభవార్తలు వింటారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. సాహసకృత్యాలకు, వాదోపవాదాలకు ఇది

Webdunia
ఆదివారం, 20 ఆగస్టు 2017 (06:07 IST)
మేషం : వృత్తి, ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వివాహం కానివారు శుభవార్తలు వింటారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. సాహసకృత్యాలకు, వాదోపవాదాలకు ఇది సమయం కాదని గమనించండి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలలో ఏకాగ్రత ముఖ్యం.
 
వృషభం : ఆర్థిక లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. మత్స్యు కోళ్ళ వ్యాపారస్తులకు కలిసివస్తుంది. పెద్దల ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. స్థిరబుద్ధి లేకపోవడం వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. పాతమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. సభలు, సమావేశాల్లో చురుకుగా వ్యవహరిస్తారు.
 
మిథునం : ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగించినా క్రమేపీ సర్దుబాటు కాగలదు. తల, కాళ్లు, చేతులు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. విదేశీ పర్యటనల కోసం చేసే యత్నాల్లో అడ్డంకులు తొలగిపోతాయి. వాహనం నడుపుతున్నపుడు మెలకువ, ఏకాగ్రత వహించండి. స్త్రీలకు బంధు వర్గాలతో సఖ్యత నెకొంటుంది.
 
కర్కాటకం : హోటల్, తినుబండరాలు, బేకరీ వ్యాపారులకు లాభదాయకం. రావలసిన మొండిబాకీలు వాయిదాపడతాయి. బంధువుల గురించి అందిన ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. గృహనిర్మాణాలు, మరమ్మతులతో పెరిగిన వ్యయం ఆందోళన కలిగిస్తుంది. చిన్నచూపు చూసిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు.
 
సింహం : ఖర్చులు అంతగా లేకున్నా ధనవ్యయం విషయంలో ఏకాగ్రత వహించండి. విద్యార్థులు క్రీడాకార్యక్రమాలలో పాల్గొంటారు. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. మీ శ్రమ, యత్నాలు వృధాకావు. దైవ దర్శనాలు అనుకూలిస్తాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదని గమనించండి.
 
కన్య : బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దలు పరోపకారానికి పోవడం వల్ల మాటపడవలసి వస్తుంది. ఇతరుల వ్యవహారాలలో మౌనం పాటించడం మంచిది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకోండి. ఒక స్థాయి వ్యక్తుల కలయిక ఆశ్చర్య కలిగిస్తుంది. పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది.
 
తుల : కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. ప్రయాణాలు వాయిదాపడతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. కీలకమైన విషయాల్లో పట్టు సాధిస్తారు. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. గుట్టుగా వ్యాపార యత్నాలు సాగించండి.
 
వృశ్చికం : స్త్రీలు, షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. మీరు ఊహించనిదానికంటే అధికంగా వ్యయం అవుతుంది. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో పనివారలతో చికాకులు తప్పవు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. మితమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి.
 
ధనస్సు : భాగస్వామిక వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తికరంగా సాగుతాయి. దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వాహనం నడపటం వల్ల ఇబ్బందులకు గురికాక తప్పదు. మీ అభిరుచికి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
 
మకరం : పుణ్యకార్యక్రమాలకు సహాయ సహకారాలు అందజేస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో శ్రద్ధ, ఆసక్తి చూపుతారు. దైవ, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
కుంభం : కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలోనూ, అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. స్త్రీల ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలి.
 
మీనం : ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులుపడుట వల్ల మాట పడవలసి వస్తుంది. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. విద్యార్థుల అత్యుత్సాహం విపరీతాలకు దారితీసే ఆస్కారం ఉంది. శ్రీవారు, శ్రీమతికి అవసరమైన వస్తువులు సేకరిస్తారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

సోనియా గాంధీకి ఏమైంది... వైద్యుల పర్యవేక్షణలో చికిత్స!!

మోడల్ గొంతు కోసి హత్య.. మృతదేహాన్ని కాలువలో పడేశారు..

అన్నీ చూడండి

లేటెస్ట్

Sankashti Ganesh Chaturthi: కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే ఇబ్బందులు పరార్

13-06-2025 శుక్రవారం దినఫలితాలు - లక్ష్యసాధనకు కృషి ప్రధానం...

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

11-06-2025 బుధవారం దినఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు....

Strawberry Moon: ఆకాశంలో స్ట్రాబెర్రీ చంద్రుడు- చంద్రస్నానం అంటే ఏమిటి?

తర్వాతి కథనం
Show comments