Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శుభోదయం : మీ రాశి ఫలితాలు 16-08-17... పట్టుదలకు పోవడం మంచిది కాదు..

మేషం : ఈ రోజు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. విద్యార్థుల మొండివైఖరి మీకు ఎంతో ఆందోళన చెందుతుంది. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు అధికమవుతాయి. రావలసిన

Advertiesment
శుభోదయం : మీ రాశి ఫలితాలు 16-08-17... పట్టుదలకు పోవడం మంచిది కాదు..
, బుధవారం, 16 ఆగస్టు 2017 (05:43 IST)
మేషం : ఈ రోజు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. విద్యార్థుల మొండివైఖరి మీకు ఎంతో ఆందోళన చెందుతుంది. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు అధికమవుతాయి. రావలసిన బాకీలు వసూలు అవుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
వృషభం : ఈ రోజు బ్యాంకు వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ సంతానం కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. కోర్టు వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. ఆరోగ్యంలో సంతృప్తికానరాదు. 
 
మిథునం : ఈ రోజు దంపతులకు ఏ విషయంలోనూ పొత్తు కుదరదు. దుబారా ఖర్చులు అధికం. విద్యార్థులకు పరిచాలు, వాతావరణం కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. రుణం తీర్చడానికై చేయు యత్నాలు ఫలిస్తాయి. 
 
కర్కాటకం : ఈ రోజు ఆర్థిక లావాదేవీల్లో మెలకువ వహించండి. తొందరపడి హమీలివ్వొద్దు. వాగ్వాదాలు, అనవసర విషయాలకు దూరంగా ఉండాలి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. మీ జీవిత భాగస్వామితో మీ అభిప్రాయాలు సున్నితంగా తెలియజేయండి. 
 
సింహం : ఈ రోజు ఆర్థిక వ్యవహారాల్లో ఆచి, తూచి వ్యవహరించడం మంచిది. అస్థిరమైన నిర్ణయాల వల్ల కొంత ఇబ్బందులు తలెత్తే ఆస్కారం ఉంది. శుభకార్యయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యుల నుంచి ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. దైవదర్శనాల ప్రశాంతత పొందుతారు. 
 
కన్య : ఈ రోజు కార్యసాధనకు లౌక్యంగా వ్యవహరించాలి. పట్టుదలకు పోవడం క్షేమంకాదు. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. ప్రయత్నపూర్వకంగా అవకాశాలు కలిసివస్తాయి. ఊహించని ఖర్చులే ఊంటాయి. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. వృత్తుల వారికి సామాన్యం. సేవ, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. 
 
తుల : ఈ రోజు రుణభారం పెరిగే సూచన ఉన్నది. ఆచితూచి అడుగులు వేయడం మంచిది. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన అవసరం. అధికారులకు పర్యటనలు, ఒత్తిడి, పనిభారం, విశ్రాంతి లోపం. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. సాంస్కృతిక, కళారంగాల్లో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఎరువులు, విత్తన వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి. 
 
వృశ్చికం : ఈ రోజు ఓర్పు, పట్టుదలతో శ్రమించి మీరు అనుకున్నది సాధిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. ముఖ్యుల నుండి అందుకున్న ఆహ్వానాలు సంతోషపరుస్తాయి. పెద్దలను, ప్రముఖులను కలుసుకుంటారు. రావలసిన ధనం వసూలు విషయంలో జాప్యం తప్పదు. విద్యార్థుల ఉన్నత విద్య కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. 
 
ధనస్సు : ఈ రోజు ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబంలో అనుకూల వాతావరణం నెలకొంటాయి. విదేశాలు, దూర ప్రయాణాలకై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. మీ పాత సమస్యలు త్వరలోనే ఒక కొలిక్కి రాగలవు. స్థిరాస్తి కొనుగోలు యత్నం వాయిదా పడటం మంచిది. రియల్ ఎస్టేట్ రంగాల్లో వారికి కలిసిరాగలదు. 
 
మకరం : ఈ రోజు వృత్తి, వ్యాపారులకు ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. మీ ప్రమేయం లేకున్నా అకారణంగా మాటపడవలసి వస్తుంది. ఉద్యోగస్తులు ఇతర వ్యాపకాలను విడనాడి శ్రమించడం శ్రేయోదాయకం. ముఖ్యలకోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలుతప్పవు. 
 
కుంభం : ఈ రోజు తలచిన పనులు వెంటనే పూర్తిచేయగలుగుతారు. గృహంలో శుభకార్యయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యలరాకతో మీలో నూతనోత్సహం నెలకొంటుంది. వృత్తి వ్యాపారులకు శుభదాయకం. ఔషధ సేవనం తప్పకపోవచ్చు. రావలసిన ధనం సకాలంలో అందుకుంటారు. దైవదర్శనాలు అనుకూలిస్తాయి. 
 
మీనం : ఈ రోజు కీలకమైన వ్యవహారాల్లో మెలకువ వహించండి. మిత్రులకిచ్చిన మాట కోసం శ్రమ, ప్రయాసలు పడవలసి ఉంటుంది. వ్యాపారస్తులకు, వృత్తుల వారికి ఆశించినంత పురోగతి ఉండదు. స్థిరాస్తి వ్యవహారాలు వాణిజ్య ఒప్పందాలలలో మెళకువ వహంచండి. బంధుమిత్రుల మధ్య అనుబంధాలు బలపడతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సొంతిళ్ళు సంపాదించడం చాలా ఈజీ... ఇలా చేయండి!