Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సొంతిళ్ళు సంపాదించడం చాలా ఈజీ... ఇలా చేయండి!

ప్రతి కుటుంబానికి సొంతిళ్ళు ఒక కల. కష్టించిన డబ్బుతో ఇళ్ళు కట్టుకోవాలనో.. కొనుక్కోవాలనో అనుకుంటుంటాం.. కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడకపోవచ్చు. కష్టానికి దైవం తోడైతే ఖచ్చితంగా నెరవేరుతుందట. కలియుగ

సొంతిళ్ళు సంపాదించడం చాలా ఈజీ... ఇలా చేయండి!
, మంగళవారం, 15 ఆగస్టు 2017 (15:11 IST)
ప్రతి కుటుంబానికి సొంతిళ్ళు ఒక కల. కష్టించిన డబ్బుతో ఇళ్ళు కట్టుకోవాలనో.. కొనుక్కోవాలనో అనుకుంటుంటాం.. కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడకపోవచ్చు. కష్టానికి దైవం తోడైతే ఖచ్చితంగా నెరవేరుతుందట. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్న ప్రతి శనివారం తూచా తప్పకుండా పూజిస్తే ఖచ్చితంగా సొంత ఇంటిని పొందవచ్చునంటున్నారు పండితులు.
 
శనివారం వ్రతమాచరించి శ్రీవారిని పూజించే వారికి సొంత ఇల్లే కాదు.. అనుకున్నది నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు. శనివారం స్వామివారికి వ్రతం చేసే సమయంలో వెండితో చేసిన ఇంటినికానీ లేకుంటే అంతస్థోమత లేకుంటే మట్టితో చేసిన ఇంటిని కానీ ఇస్తామని శ్రీవారిని వేడుకోవాలట. ముందుగానే అలాంటి ప్రతిమను చేసుకొని ఇంటిలోని పూజ గదిలో ఉంచి ఉత్తర దిక్కున పెట్టుకోవాలి. ఆ ఇంటిని ప్రతి శనివారం పువ్వులు, అక్షింతలు వేసి ఆ ఇంటిలో దీపం వెలిగించి పూజించాలట. 
 
స్వామివారికి అలా పూజిస్తే తప్పక ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. పూజగదిలోని ఇంటి ప్రతిమ ముందు 5 పిడికెల బియ్యం, పాలు, బెల్లం వీటిని ఉండలా చేసుకొని ఆ బియ్యం పిండి ముద్దపై దూది వత్తులు ఉంచాలి. అలాగే కరిగించిన నెయ్యిని ముద్దలో పోసి వెలిగించాలి. భూమి, నీరు, ఆకాశానికి ఆ దీపం ప్రతీక. ఆ ప్రతిమ ముందు ఆ దీపాన్ని ఉంచి 108 సార్లు ఓం వేంకటేశాయ అంటే చాలు ఎంతో మంచిదంటున్నారు. శ్రావణమాసం ప్రారంభిస్తే ఇంకా మంచిదట. సొంతిళ్ళు మాత్రమే కాదు ఆస్తి, లౌకిక కోరికలు ఇలా ఎన్నో స్వామివారి కృపతో లభిస్తాయని పండితులు చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శుభోదయం... మీ రాశి ఫలితాలు 15-08-2017