రొమాన్స్ కలలొస్తే అర్థం ఏమిటి? లిప్ కిస్ ఇచ్చేటట్లు కలవస్తే..?

మానవులందరికీ స్వప్నాలు రావడం మామూలే. అందులో చాలామందికి రొమాన్స్ చేసేట్లు కలలు వస్తుంటాయి. వాటిని ఎలా బయటికి చెప్పడం సిగ్గుగా వుండదూ.. అంటూ చాలామంది తమకొచ్చిన డ్రీమ్స్‌ను ఇతరులతో పంచుకోకుండా సైలెంట్‌గా

సోమవారం, 14 ఆగస్టు 2017 (12:35 IST)
మానవులందరికీ స్వప్నాలు రావడం మామూలే. అందులో చాలామందికి రొమాన్స్ చేసేట్లు కలలు వస్తుంటాయి. వాటిని ఎలా బయటికి చెప్పడం సిగ్గుగా వుండదూ.. అంటూ చాలామంది తమకొచ్చిన డ్రీమ్స్‌ను ఇతరులతో పంచుకోకుండా సైలెంట్‌గా వుండిపోతారు. అలాంటి కలలు మీకూ వచ్చాయా? అయితే ఆ కలల అర్థమేమిటో తెలుసుకోండి.

ప్రేమను వ్యక్తపరిచే.. ప్రపోజల్ చేస్తున్నట్లు కల వస్తే.. మీరు చేస్తున్న పని లేదా మీరు చేయబోతున్న పని సక్సెస్ అవుతుందని గ్రహించాలి. మాజీ ప్రేయసి లేదా మాజీ సతీమణితో శృంగారంలో పాల్గొన్నట్లు కలవస్తే.. వారితో సంబంధాలు కటీఫ్ కానున్నాయని అర్థం చేసుకోవాలి.
 
ఒక వేళ పెళ్ళైన వారికి మాజీ ప్రేయసిని తలచుకుంటూ వుండేవారికి.. అలాగే విడాకుల కోరి మాజీ సతీమణిని దూరం చేసుకోవాలనుకునేవారికి ఇలాంటి కల వస్తే తప్పకుండా వారి నుంచి దూరం కానున్నారని గ్రహించాలి. గర్భం దాల్చిన మహిళ కలలో కనిపిస్తే.. లేదా కలగనే వారే గర్భమవుతున్నట్లు కలవస్తే.. జీవితంలో అభివృద్ధికి సంబంధించిన శుభకార్యాలు ప్రారంభమవుతాయి. ముందు వెనకా పరిచయం లేని వ్యక్తులతో రొమాన్స్ చేసినట్లు కల వస్తే... జీవితంలో కొత్త మలుపు చోటుచేసుకుంది. అభివృద్ధి సాధ్యమవుతుందని అర్థం చేసుకోవాలి.
 
ఒకే లింగబేధం వున్న వారు రొమాన్స్ చేసుకుంటున్నట్లు కలగంటే.. స్నేహానికి ఆపద తప్పదని గ్రహించాలి. లిప్ కిస్ ఇచ్చేటట్లు కలవస్తే.. జాగ్రత్తగా వుండాలని.. మిమ్మల్ని వెతుక్కుంటూ ఓ సమస్య వస్తుందని అర్థం చేసుకోవాలి. ఎప్పుడో ఓసారి ఇలా రొమాన్స్ కలలు వస్తే ఓకే కానీ.. అలాంటి కలలు తరచూ వస్తుంటే మాత్రం.. జీవితంలో అభివృద్ధి సాధించలేరని పంచాంగ నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ముక్కుపుడక ధరిస్తే... జలుబు, తలనొప్పి తగ్గుతుందట..!