Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శుభోదయం : మీ రాశి ఫలితాలు 19-08-17

మేషం : సంగీత, సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలాసవస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ సోదరి మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఆకస్మికంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. బ్యాంకు పనుల్లో మెల

శుభోదయం : మీ రాశి ఫలితాలు 19-08-17
, శనివారం, 19 ఆగస్టు 2017 (05:51 IST)
మేషం : సంగీత, సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలాసవస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ సోదరి మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఆకస్మికంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. బ్యాంకు పనుల్లో మెలకువ వహించండి. ఇంటి ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి వుంటుంది. 
 
వృషభం : బంధువుల మధ్య సయోధ్య నెలకొంటుంది. ఉద్యోగస్తులకు విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తుతాయి. మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఖర్చులు పెరిగినా ఆర్థిక సంతృప్తి, ప్రయోజనం పొందుతారు. రుణాలు కొన్ని తీరుస్తారు. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయకుండా సద్వినియోగం చేసుకోండి.
 
మిథునం: అర్థాంతంగా ముగించిన పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఆంక్షలు వంటివి ఎదుర్కొంటారు. కళ, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఎలక్ట్రానిక్ మీడియా వారికి సదవకాశాలు లభిస్తాయి. మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
కర్కాటకం: ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మీ యత్నాలు ఫలించకపోవడంతో నిరుత్సాహం చెందుతారు. ఆపద సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, ఆందోళనలు అధికమవుతాయి.
 
సింహం : ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయకుండా సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగస్తులకు విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తుతాయి. తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. ఒక స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. మీ వ్యవహారాలు సాధ్యమైనంత వరకు మీరే సమీక్షించుకోవడం మంచిది.
 
కన్య : రాజకీయాల్లో వారికి ప్రత్యర్థులు పెరుగుతున్నారని గమనించండి. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఏ విషయంలోనూ హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. ఉద్యోగరీత్యా దూరప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మీ అభిప్రాయాలకు తగిన వ్యక్తితో పరిచయాలు ఏర్పడుతాయి.
 
తుల : ఇతరుల ఆంతరంగిక విషయాల్లో తలదూర్చకండి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఐరన్, సిమెంట్, కలప రంగాల్లో వారికి చికాకులు తప్పవు. బంధుమిత్రులతో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. వాహనం నిదానంగా నడపటం శ్రేయస్కరం.
 
వృశ్చికం : గృహంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. విలువైన వస్తువుసు, వాహనం కొనుగోలు చేస్తారు. అధికారులు ధన ప్రలోభాలకు దూరంగా ఉండాలి. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు కావలసిన వ్యక్తుల కలయిక మీకు అనుకూలించగలదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
 
ధనస్సు: ఆర్థిక పరమైన చర్చలకు అనుకూలం. ఉమ్మడి వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన బలపడుతుంది. రావలసిన మొండిబాకీలు సైతం వసూలు కాగలవు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. విద్యార్థులకు దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. కోర్టు వ్యవహారాలు ప్రగతి పథంలో నడుస్తాయి.
 
మకరం : స్త్రీలు విలువైన వస్తువులు కొనుగోలుకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎంతో కొంత పొదుపు చేయాలనే మీ ప్రయత్నం ఫలించదు. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. స్త్రీల పట్టుదల వల్ల కుటుంబ సౌఖ్యం అంతగా ఉండదు.
 
కుంభం : ధనం ఏ కొంతైనా నిల్వ చేయడం వల్ల సంతృప్తి కానవస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగాల్సి ఉంటుంది. పాత మిత్రుల కలయికతో కొత్త అనుభూతి పొందుతారు. ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహనలేక మనస్పర్ధలు రావచ్చును.
 
మీనం : శస్త్ర చికిత్స చేయునప్పుడు వైద్యులకు మెళకువ అవసరం. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. మీ సమర్థతపై ఎదుటివారికి విశ్వాసం ఏర్పడుతుంది. సొంత నిర్ణయాల వల్ల కలహాలు, చికాకులు వంటివి తలెత్తుతాయి. బ్యాంకింగ్ వ్యవహారాల్లోనూ, ప్రయాణాల్లోను అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉప్పుతో దరిద్రాన్ని తరిమెయ్యవచ్చు...ఎలా!