Webdunia - Bharat's app for daily news and videos

Install App

31-10-2018 బుధవారం దినఫలాలు - శత్రువులను మిత్రులుగా...

Webdunia
బుధవారం, 31 అక్టోబరు 2018 (08:49 IST)
మేషం: ఒక స్థిరాస్తి విక్రయించాలనే మీ ఆలోచన వాయిదా వేసుకోవడం శ్రేయస్కరం. ప్రభుత్వ ఉద్యోగులకు విశ్రాంతి లభిస్తుంది. దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తి కానవస్తుంది. నిరుద్యోగులకు పోటీ పరీక్షలలో, ఇంటర్వ్యూలలో నిరాశ తప్పదు.
 
వృషభం: సోదరుల సహకారంతో ఒక సమస్యలను సునాయసంగా పరిష్కరిస్తారు. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహానం కలిగిస్తాయి. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడడం మంచిది కాదు. మీరంటే అందరికీ గౌరవం ఏర్పడుతుంది. సొంతంగా వ్యాపారం చేయాలన్న మీ కోరికనెరవేరక పోవడంతో ఆందోళన చెందుతారు.  
 
మిధునం: ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు పురోభివృద్ధి కానవస్తుంది. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులు ఎదుర్కుంటారు. సేవ సంస్థల్లో సభ్యత్వం స్వీకరిస్తారు. శత్రువులను మిత్రులుగా మార్చుకుంటారు. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. ద్విచక్క వాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదని గమనించండి.  
 
కర్కాటకం: ప్రేమికుల తొందరపాటుతనం అనార్థాలకు దారితీస్తుంది. సోదరీసోదరులతో కలయిక, పరస్పర అవగాహన కుదరును. ఉద్యోగస్తులకు పెండింగ్ పనులు పూర్తి చేయడంలో సహోద్యోగులు సహకరిస్తారు. అలౌకిక విషయాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. అత్యవసరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.  
 
సింహం: నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి. బ్యాంకు వ్యవహారాలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత అవసరం. ఆకస్మిక మిత్రుల కలయిక మీకుఎంతో సంతృప్తినిస్తుంది. మీ పాత సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కొంత నిరుత్సాహానికి గురవుతారు. ఒక వ్యవహారాం నిమిత్తం ప్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు.  
 
కన్య: రవాణా, ఆటోమోబైల్, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానరాగలదు. అందరితో కలుపు గోలుగా మెలిగి మన్ననలు పొందుతారు. స్త్రీలు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. రాజకీయనాయకులు, తరచు సభాసమావేశాలలో పాల్గొంటారు. గృహంలో మార్పులకై చేయు ప్రయత్నాలు వాయిదా పడుతాయి. 
 
తుల: స్త్రీలకు ఆత్మీయుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. మీ సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. విద్యార్థులు ఉపాధ్యాయులతో ఏకీభవించలేకపోతారు. గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలి. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడం ఉత్తమం. 
 
వృశ్చికం: మిత్రులతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. పాత మెుండిబాకీలు తీరుస్తారు. ఉద్యోగస్తులకు పెండింగ్ పనులు పూర్తి చేయడంలో సహోద్యోగులు సహకరిస్తారు. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. ప్రయాణాల్లో విలువైన వస్తువుల మరిచిపోయే ఆస్కారం ఉంది. 
 
ధనస్సు: ఆర్థిక సమస్యలు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు లాభసాటిగా సాగుతాయి. మీ కళత్ర మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఖర్చులు అధికమవుతాయి. మీ ఏమరుపాటుతనం ఇబ్బందులకు దారితీస్తుంది. ప్రముఖులతో కీలకమైన వ్యవహారాలు చర్చలు జరుపుతారు.  
 
మకరం: కొబ్బరి, పండ్లూ, పూలు, తినుబండారాల వ్యాపారులకు పురోభివృద్ధి. స్త్రీలు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలించవు. ప్రింటింక్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. బంధువులను కలుసుకుంటారు. ఇంటాబయటా సానుకూల పరిస్థితులు నెలకొంటాయి. 
 
కుంభం: ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలగు. మీ సంతానం మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఓ మంచి వ్యక్తి అభిమానాన్ని పొందుతారు. అనుకున్నది సాధించే వరకు అవిశ్రాంతగా శ్రమిస్తారు. రేషన్ డీలర్లకు చికాకులు తప్పవు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. 
 
మీనం: మీ శ్రీమతి సలహా పాటించడం శ్రేయస్కరం. రాబోయే అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు చేసుకుంటారు. ఉద్యోగస్తులకు అధికారుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ఇతరులపై ఆధారపడక మీ పనులు మీరే చేసుకోవడం క్షేమదాయకం. దూరప్రదేశంలోని ఆత్మీయులు, సంతానంతో సంభాషిస్తారు.     

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

ధనాదాయం కోసం శుక్రహోర రెమడీ.. 108 ప్రదక్షణలు 16 నేతి దీపాలు

19-04-2024 శుక్రవారం దినఫలాలు - ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన...

తర్వాతి కథనం
Show comments