Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళవారం (29-05-18) దినఫలాలు - ఆధ్యాత్మిక విషయాల పట్ల...

మేషం: సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాకారంతో మీ పనులు సానుకూలమవుతాయి. ఇతరుల మెప్పుకోసం శ్రమాధిక్యత, ఒత్తిడి ఎదుర్కొనవలసివస్తుంది. స్త్రీల నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్ల విలువైన వస్తువులు జారిపోయేందుకు

Webdunia
మంగళవారం, 29 మే 2018 (08:50 IST)
మేషం: సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాకారంతో మీ పనులు సానుకూలమవుతాయి. ఇతరుల మెప్పుకోసం శ్రమాధిక్యత, ఒత్తిడి ఎదుర్కొనవలసివస్తుంది. స్త్రీల నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్ల విలువైన వస్తువులు జారిపోయేందుకు ఆస్కారం ఉంది. దూరపు బంధువుల రాక మిమ్ములను సందేహంలో పడవేస్తుంది.
 
వృషభం: రవాణా రంగాల వారికి ప్రయాణీకులతో చికాకులు అధికమవుతాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి, ఏకాగ్రత పెంచుకుంటారు. ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థల సిబ్బందికి ఒత్తిడి, శ్రమ అధికమవుతుంది. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఏ పని మెుదలెట్టినా అసంపూర్ణంగా ముగించవలసివస్తుంది.
 
మిథునం: ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికమవుతుంది. స్త్రీలపై బంధువులు, చుట్టుపక్కల వారి ప్రభావం అధికంగా ఉంటుంది. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. మీ సంతానం పై చదువుల కోసం పొదుపు పథకాలు చేపడతారు. ప్రయత్నాపూర్వకంగా ఒక అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. 
 
కర్కాటకం: రవాణా రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. రావలసిన ధనం అందకపోవడం వల్ల నిరుత్సాహానికి లోనవుతారు. రేషన్ డీలర్లకు అధికారుల నుంచి వేధింపులెదురవుతాయి. బ్యాంకు పనుల్లో జాప్యం ఇతర కార్యక్రమాలపై ప్రభావం చూపుతుంది. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. 
 
సింహం: పత్రికా రంగంలోని వారి ఏమరుపాటు వల్ల ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. విందులలో పరిమిత పాటించండి. రాజకీయాల్లోని వారికి విరోధుల వల్ల ఒత్తిడి, ఆందోళన తప్పదు. సిమెంటు రంగాలలోని వారికి, ఇసుక వ్యాపారస్తులు సత్ఫలితాలు పొందుతారు. 
 
కన్య: నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలు కళ్ళు, నరాలు, దంతాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు క్షేమదాయకం కాదు. 
 
తుల: బేకరీ, స్వీట్స్, తినుబండారాల వ్యాపారులకు, తయారీదారులకు ఒత్తిడి పెరుగుతుంది. కీలకమైన వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. హామీలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. మిత్రులతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. మీ ఆశయ సాధనకు బంధువుల సహాకారం లభిస్తుంది.    
 
వృశ్చికం: చిన్న చిన్న విధులను సైతం ఎక్కువ శ్రద్ధతో నిర్వర్తించే ప్రయత్నం చేయండి. దైవ, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. సంగీత, సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉపాధ్యాయుల శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. గతంలో వాయిదా వేసిన పనులు పునఃప్రారంభిస్తారు. బంధుమిత్రులతో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. 
 
ధనస్సు: హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు కలిసిరాగలదు. అధికారులకు మీ సమర్థతపై నమ్మకం తగ్గుతుంది. స్త్రీలకు ఇరుగుపొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు. పారిశ్రామిక రంగంలోని వారికి కార్మిక, విద్యుత్ వంటి సమస్యలు తప్పవు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కుంటారు.
 
మకరం: రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. స్త్రీలతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. కుటుంబీకులతో ఏకీభవించకలేకపోతారు. రిప్రజెంటేటివ్‌లకు, ఏజెంట్లకు, బ్రోకర్లకు ఒత్తిడి, చికాకులు వంటివి తలెత్తుతాయి.
 
కుంభం: మీ పెద్దల ఆరోగ్య విషయంలో మెళకువ వహించండి. రావలసిన ధనం వసూళ్ళకై అధికశ్రమను ఎదుర్కుంటారు. రాజకీయ నాయకులు సభా సమావేశాలలో పాల్గొంటారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయవలసివస్తుంది. 
 
మీనం: ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు కొలిక్కి వస్తాయి. రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఉమ్మడి వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. మీరు చేసే పనులకు బంధువుల నుండి విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Ugadi 2025: ఉగాది రోజు బ్రహ్మ ముహూర్తంలో ఈ పూజ చేస్తే సర్వశుభం..

26-03-2025 బుధవారం దినఫలితాలు - మీ బలహీనతలు అదుపు ఉంచుకోండి...

నన్ను ప్రేమించి ఆమెను పెళ్లాడుతావా?: శిలగా మారిపోయిన వేంకటేశుడు

25-03-2025 మంగళవారం దినఫలితాలు - పొదుపు పథకాలపై దృష్టి పెడతారు...

AP Govt: అమరావతిలో శ్రీవారి ఆలయం- రూ.185 కోట్లు కేటాయింపు.. అద్భుతంగా నిర్మాణం

తర్వాతి కథనం
Show comments