Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

25-05-2018 - శుక్రవారం రాశిఫలితాలు.. బంధువర్గాలలో తెగిపోయిన రాకపోకలు?

మేషం: ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. దైవ సైవా కార్యక్రమాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. మీ సంతానం మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవస

Advertiesment
daily horoscope
, శుక్రవారం, 25 మే 2018 (09:09 IST)
మేషం: ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. దైవ సైవా కార్యక్రమాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. మీ సంతానం మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. బంధువులను కలుసుకుంటారు.
 
వృషభం: ఆర్థికంగా ఒక అడుగు ముందుకు వేస్తారు. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. మీ కళత్ర ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కుంటారు. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు జాగ్రత్త అవసరం. 
 
మిథునం: సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. బ్యాంకు వ్యవహారాలలో మెళకువ అవసరం. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు.
 
కర్కాటకం: విదేశీ వ్యవహారాల రంగాలకు చెందిన వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి ఎదురవుతుంది. కోర్టు వ్యవహారాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. నూతన వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించండి. వృత్తి పరంగా ఎదురైన సమస్యలు తొలగిపోతాయి. 
 
సింహం: వైద్య, ఇంజనీరింగ్ రంగంలో వారికి మెళకువ అవసరం. ఓ చిన్న విహారయాత్ర చేస్తారు. దూరపు బంధువులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. స్త్రీలకు సంపాదనపట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రభుత్వ కార్యాలయాలలోని పనులు వాయిదా పడుతాయి. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం క్షేమదాయకం.
 
కన్య: ఇంజనీరింగ్ రంగంలో వారికి మెళకువ అవసరం. ఓ చిన్న విహారయాత్ర చేస్తారు. దూరపు బంధువులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. బంధువర్గాలలో తెగిపోయిన రాకపోకలు పునఃప్రారంభమవుతాయి. ప్రతి విషయంలోను బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. 
 
తుల: కుటుంబీకుల కోసం ధనం విరివిగా వ్యయం చేయాల్సి ఉంటుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. రావలసిన ధనం వసూల్లో కొంత మెుత్తం వసూలు కాగలదు. ప్రముఖుల కలయిక అనుకూలించదు. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. అర్థాంతంగా నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు.
 
వృశ్చికం: కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తులకు అధికారులతో సంబంధాలు మెరుగుపడుతాయి. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై నుంచి ప్రభావం చూపుతాయి. మిమ్మిల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారలతో ఇబ్బందులు ఎదుర్కుంటారు.
 
ధనస్సు: పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. వ్యాపార వర్గాల వారికి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటారు. షాపుగుమాస్తాలు, పనివారలకు వస్త్ర, ప్రాప్తి, ధనలాభం, విందు భోజనం. 
 
మకరం: చేపట్టిన పనులు అర్థాంతంగా ముగించాల్సి వస్తుంది. సోదరీ, సోదరుల మధ్య సఖ్యతాలోపం, కలహాలు చోటు చేసుకుంటాయి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. సినిమా, విద్య, సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు పెంచుకుంటారు. 
 
కుంభం: మీ సంతానం భవిష్యత్ గురించి కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. స్త్రీలకు బంధువర్గాల నుంచి ఒత్తిడి, మెుహమ్మాటాలను ఎదుర్కుంటారు. పాత మిత్రుల కలయిక సంతృప్తినిస్తుంది. నేడు ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి.
 
మీనం: కొబ్బరి, పండ్ల, పూల, బేకరీ, కూరగాయల వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ఉన్నతస్థాయి అధికారులు ధనప్రలోభం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్నవరస్వామి... సత్యదేవుని వ్రతం ఎందుకు చేస్తారు?