Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అన్నవరస్వామి... సత్యదేవుని వ్రతం ఎందుకు చేస్తారు?

ప్రస్తుత కాలంలో నూతన గృహం నిర్మించుకున్న తర్వాత మనం చేసుకునే మెుట్టమెుదటి కార్యం శ్రీ సత్యదేవ వ్రతం. అంతేకాక కలి బాధల నుండి విముక్తి పొందటానికి మనం ఈ సత్యవ్రతం ఆచరిస్తే మనకు అన్ని శుభాలు జరుగుతాయని భావిస్తాము. అంతటి శుభాలను కలిగించే ఈ స్వామి అన్నవరంల

Advertiesment
అన్నవరస్వామి... సత్యదేవుని వ్రతం ఎందుకు చేస్తారు?
, గురువారం, 24 మే 2018 (22:20 IST)
ప్రస్తుత కాలంలో నూతన గృహం నిర్మించుకున్న తర్వాత మనం చేసుకునే మెుట్టమెుదటి కార్యం శ్రీ సత్యదేవ వ్రతం. అంతేకాక కలి బాధల నుండి విముక్తి పొందటానికి మనం ఈ సత్యవ్రతం ఆచరిస్తే మనకు అన్ని శుభాలు జరుగుతాయని భావిస్తాము. అంతటి శుభాలను కలిగించే ఈ స్వామి అన్నవరంలో ఎలా వెలిసారో తెలుసుకుందాం.
 
పర్వతశ్రేష్టులలో ఒకడైన మేరుపర్వతం ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు ఆచరించి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు. వారిలో ఒకరు భద్రుడు, ఇంకొకడు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తి గురించి తపస్సు చేసి శ్రీరాముడి నివాస స్ధానమైన భద్రాచలంగా మారతాడు.
 
రత్నకుడు అనే ఇంకొక కొడుకు కూడా విష్ణువును గురించి తపస్సు చేసి విష్ణువును మెప్పించి శ్రీ మహావిష్ణువు శ్రీ వీరవేంకటసత్యనారాయణ స్వామిగా వెలసే రత్నగిరి లేదా రత్నాచలం కొండగా మారతాడు. తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురానికి సమీపంలో గోరస గ్రామ ప్రభువు శ్రీ రాజా ఇనుగంటి రామారాయణిం బహద్దూర్ వారి పరిపాలనలో అరికంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మహాభక్తుడు. 
 
ఒకనాడు మహావిష్ణువు వీరికీ శ్రీరాజ ఇనగంటి వేంకట రామారాయణిం బహద్దూర్ వారికి ఏక కాలంలో కలలో కనపడి, రాబోవు శ్రావణ శుక్ల విదియ మఖా నక్షత్రంలో గురువారం నాడు రత్నగిరిపై వెలయుచున్నాను. నీవు నన్ను శాస్త్ర నియమానుసారం ప్రతిష్టించి సేవించుము.. అని చెప్పి మాయమయ్యాడు.
webdunia
 
మరునాడు ఇరువురు కలసి తమకు వచ్చిన కలను చెప్పుకొని ఖరనామ సంవత్సరం శ్రావణశుక్ల పాడ్యమి నాటికే అన్నవరం చేరుకున్నారు. అక్కడ స్వామి వారి కొరకు వెతుకుతుండగా ఒక అంకుడు చెట్టుకింద పొదలో స్వామివారి పాదముల మీద సూర్యకిరణములు పడ్డాయి. వెంటనే వారు ఆ పొదను తొలగించి స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండపైకి తీసుకుపోయి కాశీ నుండి తెచ్చిన శ్రీమత్రిపాద్విభూతి మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని విష్ణుపంచాయతన పూర్వకంగా సాధారణ శకం 1891 ఆగష్టు 6వ తేదీన ప్రతిష్టించారు. తరువాత కాలంలో అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి దేశం నలుమూలల నుండి భక్తులు తరలి వస్తారు. ఈ ఆలయంలో ప్రతినిత్యం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతూ ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ వజ్రం 'శ్రీవారి'దే అయితే వారిద్దరినీ అరెస్టు చేయాలట.. చినరాజప్ప(Video)