Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ వజ్రం 'శ్రీవారి'దే అయితే వారిద్దరినీ అరెస్టు చేయాలట.. చినరాజప్ప(Video)

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి చెందిన పింక్ డైమండ్‌‌ను జెనీవాలో వేలం వేశారనే వార్త నిజమైతే... అప్పట్లో ప్రధాన అర్చకుడిగా ఉన్న రమణ దీక్షితులుతో పాటు అప్పటి టీటీడీ ఈవో ఐవైఆర్ కృష్ణారావును కూడా అరెస్ట్ చే

ఆ వజ్రం 'శ్రీవారి'దే అయితే వారిద్దరినీ అరెస్టు చేయాలట.. చినరాజప్ప(Video)
, గురువారం, 24 మే 2018 (18:49 IST)
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి చెందిన పింక్ డైమండ్‌‌ను జెనీవాలో వేలం వేశారనే వార్త నిజమైతే... అప్పట్లో ప్రధాన అర్చకుడిగా ఉన్న రమణ దీక్షితులుతో పాటు అప్పటి టీటీడీ ఈవో ఐవైఆర్ కృష్ణారావును కూడా అరెస్ట్ చేయాలని సుప్రీంకోర్టు న్యాయవాది డాక్టర్ డీవీ రావు అభిప్రాయపడ్డారు. అలాగే, ఈ విలువైన వజ్రం విదేశాలకు సాఫీగా తరలివెళ్లేందుకు కస్టమ్స్ శాఖ అధికారులు అనుమతి ఇచ్చినందుకు కేంద్రం నైతిక బాధ్యత  వహించాలన్నారు.
 
శ్రీవారి వజ్రం వ్యవహారం తీవ్ర వివాదాస్పదమైన విషయం తెల్సిందే. దీనిపై డీవీరావు స్పందిస్తూ, 2001లో గరుడసేవలో తన సమక్షంలోనే పింక్ డైమండ్ పగిలిందని రమణ దీక్షితులు చెప్పారని... పగిలింది డైమండ్ కాదు, రూబీ అని అప్పటి ఈవో ఐవైఆర్ నివేదిక ఇచ్చారని గుర్తు చేశారు. 
 
జగన్నాథరావు కమిటీ కూడా ఆ నివేదికను సమర్థించిందన్నారు. ఈ నేపథ్యంలో, జెనీవాలో వేలం వేసింది శ్రీవారి వజ్రం అని రమణ దీక్షితులు ఇప్పుడు చెబుతుండటంపై ఎవరైనా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే... రమణ దీక్షితులతో పాటు ఐవైఆర్‌ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని అన్నారు. 
 
అలాగే, అర్చకులు కారుణ్య నియామకాలను కోరడంలో తప్పు లేదని... కానీ, రిటైర్మెంట్ తర్వాత వంశపారంపర్యంగా కోరడం సరికాదన్నారు. టీటీడీలో పదవీ విరమణ వయసుకు సంబంధించి గతంలోనే హైకోర్టు తీర్పునిచ్చిందని అన్నారు. వీటిని ఇపుడు సవాల్ చేసే అవకాశమే లేదన్నారు. రమణదీక్షుతులు వ్యాఖ్యలపై మంత్రి చిరాజప్ప ఏమంటున్నారో చూడండి ఈ వీడియోలో...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఘనపురం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి మహిమ-ఏలినాటి శని గ్రహ ప్రభావం తొలగిపోవాలంటే?