Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సోమవారం దినఫలాలు - అంతరంగిక విషయాలు గోప్యంగా...

మేషం: బ్యాంకు పనుల్లో ఆలస్యం ఇతర వ్యవహారాలపై ప్రభావం చూపుతుంది. మీ రాక బంధువులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. స్త్రీలకు దంతాలు, నరాలు, కళ్ళకు సంబంధించిన చికాకులు తలెత్తుతాయి. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్

Advertiesment
Daily Horoscope
మేషం: బ్యాంకు పనుల్లో ఆలస్యం ఇతర వ్యవహారాలపై ప్రభావం చూపుతుంది. మీ రాక బంధువులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. స్త్రీలకు దంతాలు, నరాలు, కళ్ళకు సంబంధించిన చికాకులు తలెత్తుతాయి. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు పురోభివృద్ధి. మీ అంతరంగిక, కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి.
 
వృషభం: ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఉద్యోగస్తులు అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండాలి. స్త్రీలకు షాపింగ్‌లోను అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత ముఖ్యం. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. 
 
మిథునం: స్ధిరాస్తి ఏదైనా అమ్మకం చేయాలనే మీ ఆలోచన వాయిదా వేయడం శ్రేయస్కరం. అనవసరపు వివాదాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. ఉద్యోగ ప్రయత్నం అనుకూలించడంతో మీలో నూతన ఉత్సాహం చోటు చేసుకుంటుంది. మీ ప్రమేయం లేకున్నా కొన్ని తప్పిదాలకు బాధ్యత వహించవలసివస్తుంది.  
 
కర్కాటకం: కొంతమంది మీ నుండి ధనసహాయం అర్ధిస్తారు. మార్కెటింగ్ రంగాల వారికి, ఏజెంట్లకు, బ్రోకర్లకు యాజమాన్యం నుండి ఒత్తిడి పెరుగుతుంది. రుణం కొంత మెుత్తం తీర్చడంతో ఒత్తిడి నుండి కుదుటపడతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. 
 
సింహం: ప్రింటింగ్ రంగాలలో వారు అచ్చు తప్పులు పడుటవలన మాటపడవలసివస్తుంది. దైవ, సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. స్త్రీలతో మితంగా సంభాషించడం క్షేమదాయకం. ఉద్యోగస్తుల తొందరపాటు, చర్యలు, నిర్లక్ష్యం వల్ల కొత్త సమస్య లెదుర్కోవలసి వస్తుంది.
 
కన్య: ఉద్యోగ వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధికమిస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. స్త్రీల మనోభావాలు వ్యక్తం చేయడం వల్ల అశాంతికి గురవుతారు. వైద్యులకు ఒత్తిడి, పనిభారం తప్పవు. వారసత్వపు వ్యవహారాలు అనుకూలిస్తాయి. పుణ్యక్షేత్రాలు దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. 
 
తుల: మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికం అవుతున్నారని గమనించండి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. రావలసిన పత్రాలు, రసీదులు చేతికందుతాయి. మీ అంచనాలు, ఊహలు ఫలిస్తాయి. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి.   
 
వృశ్చికం: పారిశ్రామిక రంగాల వారికి, ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి అభ్యంతరాలెదుర్కోవలసి వస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన మార్పులుంటాయి. స్త్రీలకు ఉద్యోగం చేయాలనే ఆలోచన స్పురిస్తుంది. వైద్యులకు ఓర్పు, ఏకాగ్రత ఎంతో ముఖ్యం.  
 
ధనస్సు: ప్రముఖ పుణ్యక్షేత్రం సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. మీ శ్రీమతి వ్యాఖ్యలు మీపై బాగా ప్రభావం చూపుతాయి. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మార్కెటింగ్, ప్రైవేటు సంస్థలలోని వారు అధిక శ్రమ, ఒత్తిడికి గురవుతారు. దూర ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. ఉద్యోగ, రుణ యత్నాల్లో కొంతపురోగతి ఉంటుంది. 
 
మకరం: స్త్రీలకు ఉదరం, మోకాళ్లు, నరాలకు సంబంధించిన చికాకులు అధికం. దైవ సేవా కార్యక్రమాల కోసం ధనం వ్యయం చేస్తారు. వాహనం వీలైనంత నిదానంగా నడపటం అతి ముఖ్యం. ఉద్యోగస్తులు తోటివారి కారణంగా అధికారులకు వివరణ ఇచ్చుకోవలసివస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం.
 
కుంభం: వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి పురోగతిన సాగుతాయి. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. క్షేమదాయకం. రిప్రజెంటేటివ్‌లకు, ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికమపుతుంది. పుణ్యకార్యాక్రమాల్లో పాల్గొంటారు. ప్రేమికుల మధ్య ఎడబాట్లు తప్పవు. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు.
 
మీనం: ప్రయత్నపూర్వకంగానే అనుకున్న పనులు పూర్తి కాగలవు. వాతావరణంలో మార్పు వల్ల పెద్దలు స్పల్ప అస్పస్థతకు లోనవుతారు. క్రీడల పట్ల ఆసక్తి చూపుతారు. నోరు అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. వైద్య, ఇంజనీరింగ్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. ప్రేమికుల మధ్య అనుమానాలు, అపార్ధాలు తలెత్తుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆదివారం దినఫలాలు - నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు...