Webdunia - Bharat's app for daily news and videos

Install App

24-06-2019 సోమవారం మీ రాశి ఫలితాలు

Webdunia
సోమవారం, 24 జూన్ 2019 (10:31 IST)
మేషం : ఆహార వ్యవహారాల్లో మొహమాటం విడనాడి ఖచ్చితంగా వ్యవహరించండి. చేపట్టిన ఉపాధి పథకాలు సత్ఫలితాలనిస్తాయి. మార్కెటింగ్ రంగాల వారికి, కార్మికులకు యాజమాన్యం నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ప్రింటింగ్ రంగాల వారికి నిరుత్సాహం తప్పదు. ప్రేమికుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి.
 
వృషభం : కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. చిన్నతరహా పరిశ్రమలు, వ్యవసాయ కూలీలు ఆశాజనకం. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచింది. విద్యార్థినిలు విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలితాయి. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. వృత్తి వ్యాపారులకు ఆశాజనకంగా ఉంటుంది.
 
మిథునం : రిప్రజెంటేటివ్‌లకు, ఏజెంట్లకు బ్రోకర్లకు అధిక ఒత్తిడి, చికాకులు తప్పవు. రావలసిన ధనం వసూలు కోసం శ్రమ తప్పదు. స్త్రీలతో సంభాషించే సమయంలో మెలకువ వహించండి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉద్యోగస్తులు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది.
 
కర్కాటకం : భాగస్వామ్యుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. స్త్రీలకు కళాత్మక పోటీల పట్ల ఆసక్తి చూపుతారు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. పాత మిత్రుల నుంచి అందిన ఒక లేఖ మీకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది. మీ మనోభావాలు బయటకు వ్యక్తం చేసి సమస్యలు తీర్చుకోగలగుతారు.
 
సింహం : రవాణా రంగంలోని వారికి చికాకులు అధికమవుతాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మీ వాక్ చాతుర్యంతో అందరిని ఆకట్టుకోగలగుతారు. ఆస్తి పంపకాలకు సంబంధించి సోదరులతో ఒప్పందం కుదుర్చుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి సత్ఫలితాలు సాధిస్తారు.
 
కన్య : వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఆశించిన మార్పులుంటాయి. పరిచయంలేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. స్త్రీలు అదనపు సంపాదన దిశగా తమ ఆలోచనలు సాగిస్తారు. విద్యార్థులలో నూతన ఉత్సాహం చోటుచేసుకుంటుంది. వ్యాపారస్తులకు ప్రభుత్వ అధికారుల నుంచి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.
 
తుల : మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. బ్యాంకు పనుల్లో ఆలస్యం వల్ల ఆందోళన చెందుతారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుటమంచిది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు మెళకువ అవసరం. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు.
 
వృశ్చికం : ఏజెన్సీ, నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. షేర్ల అమ్మకం కంటే కొనుగోళ్లే లాభదాయకం. రిప్రజెంటేటివ్‌లు, ఉపాధ్యాయులకు ఒత్తిడి పెరుగుతుంది. ఇతరులకు వాహనం ఇచ్చి ఇబ్బందులకు గురవుతారు. కాంట్రాక్టర్లకు చేపట్టిన పనులలో ఏకాగ్రత లోపం వల్ల అధికారులతో మాటపడవలసి వస్తుంది.
 
ధనస్సు : అకాల భోజనం వల్ల పెద్దల ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవు. కొత్త రుణాలు కోసం అన్వేషిస్తారు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఏదుటివారితో మితంగా సంభాషించడం మంచిది.
 
మకరం : ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. యత్నాలకు కుటుంబీకుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. ధనం మితంగా వ్యయం చేయండి. అవివాహితులు కొత్త అనుభూతికి లోనవుతారు. వ్యాపారాలను సమర్థంగా నిర్వహిస్తారు. బాకీలు, ఇతరాత్రా రావలసిన ఆదాయాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి.
 
కుంభం : వ్యవహార ఒప్పందాల్లో తొందరపాటుతగదు. అనుభవజ్ఞుల సలహా పాటించడం మంచిది. వాయిదాపడిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం తగదు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. ఏజెన్సీలు, టెండర్లు, లీజు పొడగింపునకు అనుకూలం.
 
మీనం : ఉన్నట్టుండి వేదాంత ధోరణి కానవస్తుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. ధనాన్ని మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు చేస్తారు. ఉపాధ్యాయులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పిత్రార్జిత ఆస్తిని అమ్మటానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీ భర్త వేధిస్తున్నాడా? నా కోరిక తీర్చు సరిచేస్తా: మహిళకు ఎస్.ఐ లైంగిక వేధింపులు

గూగుల్ మ్యాప్ ముగ్గురు ప్రాణాలు తీసింది... ఎలా? (video)

ప్రేయసిని కత్తితో పొడిచి నిప్పంటించాడు.. అలా పోలీసులకు చిక్కాడు..

నీమచ్‌లో 84,000 చదరపు అడుగుల మహాకాయ రంగోలి ఆసియా వరల్డ్ రికార్డు

పోసాని కృష్ణమురళి రెడ్డి అని పేరు పెట్టుకోండి: పోసానిపై నటుడు శివాజి ఆగ్రహం (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

2025లో సింహ రాశి జాతకుల కెరీర్, వ్యాపారం ఇలా వుంటుంది..

శనివారం కాలాష్టమి: నల్ల శునకాలకు రొట్టెలు.. ఇప్పనూనెతో దీపం

2025 కర్కాటక రాశికి కలిసొస్తుందా? వృత్తి జీవితం ఎలా వుంటుంది?

2025లో మిథునరాశి కెరీర్, వ్యాపారం ఎలా వుంటుందంటే? కష్టం ఫలిస్తుందా?

2025లో వృషభ రాశి కెరీర్, వ్యాపారం ఎలా వుంటుందంటే?

తర్వాతి కథనం
Show comments