Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

22-06-2019 శనివారం మీ రాశిఫలాలు - అచ్చుతప్పులు పడటం వల్ల...

webdunia
శనివారం, 22 జూన్ 2019 (09:14 IST)
మేషం: ఎండుమిర్చి, నూనె, ఆవాలు, పసుపు, చింతపండు, బెల్లం, పానీయాల పట్ల ఆసక్తి చూపిస్తారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ప్రేమికుల మధ్య చికాకులు తలెత్తుతాయి. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
వృషభం: వ్యాపారాల్లో ఆటుపోట్లు తొలగి పురోభివృద్ధి సాధిస్తారు. విద్యుత్, ఏసీ, కూలర్, మెకానికల్ రంగాల్లో వారికి సంతృప్తి కానవస్తుంది. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. రాజకీయ కళా రంగాల వారికి కొంత అనుకూలిస్తుంది. ప్రియతముల చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. 
 
మిథునం : ప్రింటింగ్, స్టేషనరీ రంగాల్లోని వారు అచ్చుతప్పులు పడటం వలన మాటపడవలసి వస్తుంది. వ్యాపారాల్లో స్వల్ప ఆటంకాలు మినహా ఇబ్బందులు వుండవు. విదేశీయానాలకై చేయు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. నూతన ప్రదేశాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రాజకీయ కళా రంగాల వారికి కొంత అనుకూలిస్తుంది. 
 
కర్కాటకం: కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతాయి. వాతావరణంలోని మార్పు రైతులలో ఆందోళన కలిగిస్తుంది. దూరంగా వున్న కుటుంబ సభ్యులు ఇల్లు చేరుతారు. ప్రత్తి, పొగాకు, స్టాకిస్టులకు ఒత్తిడి తప్పవు. ముఖ్యుల కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. 
 
సింహం: డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఏదైనా స్థిరాస్తి అమ్మకానికై చేయు యత్నం వాయిదా పడటం మంచిది. ఉద్యోగస్తులు అధిక కృషి చేసి అధికారుల మెప్పు పొందుతారు. మీ అభిప్రాయాలు, మనోభావాలు సున్నితంగా వ్యక్తం చేయండి. స్త్రీలకు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. 
 
కన్య: విద్యార్థుల మితిమీరిన ఉత్సాహం అనర్ధాలకు దారి తీస్తుంది. స్త్రీల రచనలకు, కళాత్మతకు గుర్తింపు ప్రోత్సాహం లభిస్తాయి. రాజకీయాల్లో వారు సభ, సమావేశాల్లో పాల్గొంటారు. కాంట్రాక్టర్లు చేపట్టిన పనులు ఏమంత సంతృప్తినివ్వజాలవు. కొంతమంది మీరు చేసిన వ్యాఖ్యానాలను వక్రీకరించే ప్రయత్నం చేస్తారు. 
 
తుల: ఆర్థిక స్థితి ఆశించిన విధంగా మెరుగు పడకపోవడంతో నిరుత్సాహం తప్పదు. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం మంచిది. ప్రయాణాల వల్ల ఆశించిన ఫలితం వుంటుంది. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఏ అవకాశం కలిసిరాక నిరుద్యోగులు ఆందోళన చెందుతారు. 
 
వృశ్చికం: మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. స్త్రీలకు సంపాదన, ఉద్యోగం పట్ల ఆసక్తి ఏర్పడతాయి. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. ఉత్తరప్రత్యుత్తరాలు ఆశించినంత సంతృప్తికరంగా సాగవు.
 
ధనస్సు: దైవ దర్శనాలు, మొక్కుబడులు అనుకూలిస్తాయి. సంతానం పై చదువులు, కుటుంబ విషయాలపై శ్రద్ధ వహిస్తారు. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. బంధువులు రాకతో స్త్రీలకు ఆరోగ్యభంగం, వైద్య సేవలు తప్పక పోవచ్చు. నిరుద్యోగులు సదవకాశాలు లభిస్తాయి. 
 
మకరం: కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రముఖుల సిఫార్సుతో మీ పనులు సానుకూలమవుతాయి. మీ కళత్ర మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. రాబోయే ఖర్చులకు తగ్గట్టు ఆదాయం పెంచుకుంటారు. 
 
కుంభం: మీ అవసరాలకు కావలసిన ధనం చేతికి అందుతుంది. పెద్దల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. దైవ, సేవ, పుణ్యకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. భాగస్వామిక సమావేశాల్లో కొత్త వ్యక్తులతో పరిచయమవుతారు. రిటైర్డ్ ఉద్యోగస్తులకు సాదర వీడ్కోలు పలుకుతారు. 
 
మీనం: స్త్రీలకు పనివారితో చికాకులను ఎదుర్కొంటారు. సన్మానాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యుత్ వస్తువుల పట్ల ఏకాగ్రత చూపుతారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఎంతో కొంత పొదుపు చేయాలనే మీ ప్రయత్నం ఫలించదు. మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. 

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

21-6-2019 శుక్రవారం మీ రాశి ఫలితాలు.. అసూయపడే ఆస్కారం వుంది జాగ్రత్త