23-06-2019 ఆదివారం దినఫలాలు - దంపతుల మధ్య అపార్ధాలు, పట్టింపులు..

ఆదివారం, 23 జూన్ 2019 (10:09 IST)
మేషం : హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు అధికారులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. పెద్దల ఆరోగ్యం మెరుగుపడటంతో మానసికంగా కుదుటపడతారు. ఒక వ్యవహార సానుకూలతకు ధనం బాగా వెచ్చించాల్సి వస్తుంది. మిత్రులను కలుసుకుంటారు.
 
వృషభం : కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. మీ సంతానం కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఒక అవకాశం కలిసిరావడంతో మీలో ఉత్సాహం నెలకొంటుంది. సన్నిహితులు, ప్రముఖులతో సంప్రదింపులు సత్ఫలితాలనిస్తాయి. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లకు నిరుత్సాహం అధికమవుతుంది.
 
మిథునం : కుటుంబ సమేతంగా ఒక పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. వ్యవసాయ రంగాల వారికి పంటల దిగుబడి ఏమంత సంతృప్తినీయజాలదు. పరిచయాలు, కార్యకలాపాలు అధికమవుతాయి. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. విద్యార్థులు క్రీడలు, క్విజ్ పోటీల్లో రాణిస్తారు.
 
కర్కాటకం : స్త్రీల కళాత్మకు, ప్రతిభకు మంచి గుర్తింపు, పురస్కారాలు లభిస్తాయి. వేడుకలు, విందులలో అందరినీ ఆకట్టుకుంటారు. నిర్మాణ పనుల్లో పెరిగి వ్యయం ఆందోళన కలిగిస్తుంది. హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులకు పురోభివృద్ధి. బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది. బ్యాంకు పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం.
 
సింహం : దంపతుల మధ్య అపార్ధాలు, పట్టింపులు చోటు చేసుకుంటాయి. పత్రికా సంస్థల్లోని వారికి అదనపు బాధ్యతలు, పనిభారం అధికం. ఉన్నతాధికారులకు ఆకస్మిక స్థానచలనం, కిందిస్థాయి సిబ్బందితో సమస్యలు తప్పవు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. మిమ్ములను పొగిడే వారిపట్ల మెలకువ వహించండి.
 
కన్య : ఉద్యోగస్తుల సమర్థతకు ఏమంత గుర్తింపు ఉండదు. వస్త్రాలు, విలువైన వస్తువుల కొనుగోళ్లకు ధనం విరివిగా వ్యయం చేస్తారు. కోర్టు వ్యాజ్యాలు, ఫిర్యాదులు ఉపసంహరించుకుంటారు. బేకరి, పండ్ల, పూల, చిరు వ్యాపారాలు జోరుగా సాగుతాయి. విద్యార్థులు అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది.
 
తుల : రావలసిన ధనం అందడంతో పొదుపు దిశగా ఆలోచనలు సాగిస్తారు. స్త్రీలకు దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ వ్యవహార దక్షత, పట్టుదలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించినా ఆశించిన ఫలితం ఉండదు. రాజకీయనాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.
 
వృశ్చికం : ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల్లో మదుపు చేయడం క్షేమం కాదు. ఇంటి అదెల వసూలులో సంయమనం పాటించండి. వ్యాపారాల్లో పోటీని తట్టుకోవటానికి కొత్త కొత్త పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. బంధువులు, అయిన వారి రాకతో గృహంతో సందడి నెలకొంటుంది. మీ ప్రసంగాలు శ్రోతలను ఆకట్టుకుంటాయి.
 
ధనస్సు : కొన్ని సందర్భాల్లో మీ వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతాయి. ఖర్చులు పెరిగినా భారమనిపించవు. కొన్ని పనులు విసుగు కలిగించినా మొండిగా పూర్తి చేస్తారు. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించడం వల్ల అస్వస్థతకు లోనవుతారు. కుటుంబ సభ్యుల కంటే సన్నిహితుల కోసమే ధనం బాగా వ్యయం చేస్తారు.
 
మకరం : ఇతరుల విషయాలకు, వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆత్మీయులు దూరమవుతున్నారనే భావం నిరుత్సాహం కలిగిస్తుంది. ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. సంగీత, సాహిత్య, కళా రంగాల వారికి ప్రోత్సాహకరం. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు.
 
కుంభం : విలువైన వస్తువుల కొనులోలులో నాణ్యత పట్ల అవగాహన ముఖ్యం. ఒక స్థిరాస్తి విక్రయించే విషయంలో పునరాలోచన మంచిది. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. మీ అభిప్రాయం సున్నితంగా వ్యక్తం చేయడం శ్రేయస్కరం. రుణయత్నాల్లో ఆటంకాలు తొలగిపోతాయి.
 
మీనం : విందులు, వినోదాల్లో అపశృతులు దొర్లే అవకాశం ఉంది. భాగస్వామిక చర్చలు అర్థాంతరంగా ముగుస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. చెక్కుల జారీ, హామీలు, మధ్యవర్తిత్వాల్లో మెలకువ వహించండి. ఉపాధ్యాయులకు, విద్యార్థుల ధోరణి చికాకు కలిగిస్తుంది. బిల్లులు చెల్లిస్తారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం శ్రీవారి ఆభరణాల లెక్క నిగ్గు తేలుస్తాం : తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి