Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుక్రవారం (24-05-2019) మీ రాశిఫలాలు

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (08:13 IST)
మేషం : మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి ప్రయాసలెదుర్కుంటారు. క్యాటరింగ్ పనివారలకు, వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో ఖర్చుకు వినియోగించవలసి వస్తుంది. తోటివారి ఉన్నతస్థాయితో పోల్చుకోవటం క్షేమంకాదు.
 
వృషభం : ఉపాధ్యాయులు విద్యార్ధుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఒక అనుభవం మీకెంతో జ్ఞానాన్ని ఇస్తుంది. గృహ మార్పుతో ఇబ్బందులు తొలగి మానసికంగా కుదుటపడతారు. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది.
 
మిథునం : కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా నడుస్తాయి. నేడు ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. మీకు దగ్గరగా ఉన్న, మీకే తెలియని ఒక అనకాశం మిమ్మల్ని వరిస్తుంది. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు.
 
కర్కాటకం : ఉద్యోగస్తులు తమ తొందరపాటుతనానికి చింతించవలసి ఉంటుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. స్త్రీలు ప్రముఖుల సిఫార్సుతో దైవదర్శనాలను త్వరగా ముగించుకుంటారు. అయిన వారికి ఆప్తులను విందు భోజనానికి ఆహ్వానిస్తారు. ఇవ్వాల్టీ పనులు రేపటికి వాయిదా వేయకండి.
 
సింహం : ఊహించని వ్యక్తుల నుంచి అందిన సమాచారం మీకు బాగా ఉపకరిస్తుంది. ఉద్యోగస్తులు ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. మీ కదలికలపై నిఘా ఉందన్న విషయాన్ని గమనించండి. స్థిరాస్తి విషయంలో అధిక పెట్టుబడులు పెట్టొద్దు. శంకుస్థాపనలు, గృహప్రవేశాలకు అనుకూలం. ఖర్చులు అధికం.
 
కన్య : రాజకీయ రంగాల్లో వారికి విరోధుల విషయంలో అప్రమత్తత అవసరం. భాగస్వామిక చర్చలు, ఒప్పందాలకు సంబంధించిన విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. దంపతుల మధ్య సఖ్యత లోపం, నిరుత్సాహం, చికాకులు తలెత్తుతాయి. విద్యార్ధులలో మందకొడితనం పెరుగుతుంది.
 
తుల : స్త్రీలకు ఇరుగు పొరుగువారితో సఖ్యత అంతగా ఉండదు. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. కుటుంబములో కొందరి ప్రవర్తన వల్ల మనసు వికలమవుతుంది. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనులలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
 
వృశ్చికం : విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖ ఆలయాల్లో దైవదర్శనాలు అతికష్టంమ్మీద అనుకూలిస్తాయి. ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువు దక్కించుకుంటారు. వైద్యులకు శస్త్ర చికిత్స చేయునపుడు ఏకాగ్రత చాలా అవసరం. ఉత్తర ప్రత్యుత్తరాలు, ఆహార వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం.
 
ధనస్సు : నూనె, మిర్చి, కంది వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. సన్నిహితులతో కలిసి విహార యాత్రలలో పాల్గొంటారు. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళుకువ వహించండి. స్త్రీలకు ఆరోగ్యములో చికాకులు తలెత్తవచ్చు మెళుకువ వహించండి. మీ మాటలు, అభిప్రాయాలు ఎదుటివారికి నచ్చకపోవచ్చు.
 
మకరం : కొబ్బరి, పండ్లు, పూలు, చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. బంధువులతో సఖ్యత లోపిస్తుంది. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించటం మంచిది కాదని గమనించండి. గృహంలో మార్పులు, చేర్పులు కొంత అసౌకర్యం కలిగిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది.
 
కుంభం : బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారాలు తెలుసుకుంటారు.
 
మీనం : ఉద్యోగస్తులకు విధినిర్వహణలో ఏకాగ్రత చాలా అవసరం. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో ఇంజనీరింగ్ విభాగం నుంచి అభ్యంతరాలెదురవుతాయి. స్త్రీలకు పరిచయాలు. వ్యాపకాలు అధికమవుతాయి. వ్యాపారాభివృద్ధికి నూతన పథకాలు, ప్రణాళికలు అమలు చేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

లేటెస్ట్

చెప్పులున్నవాడి వెనక అప్పులున్నవాడి వెనక అస్సలు తిరగొద్దు: గరకపాటి వారి ప్రవచనం

2025 మహాలక్ష్మి రాజయోగం.... ఈ రాశులకు కనకవర్షమే!

24-11-2014 ఆదివారం వారం ఫలితాలు : కీలక పత్రాలు జాగ్రత్త.. మీ జోక్యం అనివార్యం...

24-11-2004 నుంచి 30-11-2024 వరకు మీ వార ఫలితాలు

23-11-2024 శనివారం ఫలితాలు - శ్రమాధిక్యతతో లక్ష్యం సాధిస్తారు...

తర్వాతి కథనం
Show comments