Webdunia - Bharat's app for daily news and videos

Install App

23-05-2020 శనివారం దినఫలాలు - పద్మనాభ స్వామిని ఆరాధిస్తే...

Webdunia
శనివారం, 23 మే 2020 (05:00 IST)
మేషం : హోటల్, తినుబండరాల వ్యాపారులకు కలిసిరాగలదు. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల వారికి ఒత్తిడి, తిప్పట తప్పవు. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. సాహస ప్రయత్నాలు విరమించండి. షేర్ల అమ్మకం కంటే కొనుగోళ్లే లాభదాయకం. ఏదన్నా అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదాపడతాయి. 
 
వృషభం : పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. రుణం తీర్చడానికై చేయు యత్నాలు వాయిదాపడతాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో వారికి శుభదాయకం. మీ పథకాలు, ఆలోచనలు నిదానంగా కార్యరూపం దాల్చగలవు. విద్యార్థులు ఇతరుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. 
 
మిథునం : మీ పాత సమస్య ఒకటి పరిష్కారం కావడంతో మానసిక ప్రశాంతత పొందుతారు. ఐరన్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో వారికి లాభదాయకం. వస్త్ర, బంగారం, వెండి, లోహ వ్యాపారాభివృద్ధి కానవచ్చిన, పనివారితో చికాకులు తప్పవు. రాజకీయాలలో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తలెత్తగలవు. 
 
కర్కాటకం : ఆర్థిక విషయాలలో ఆశించినంత సంతృప్తికానవస్తుంది. ఇతరులకిచ్చిన మాట నిలుపుకునే యత్నంలో శ్రమ, ప్రయాసలు ఎదుర్కొంటారు. స్త్రీల తొందరపాటు నిర్ణయాల వల్ల సమస్యలు తప్పవు. సంఘంలో నూతన వ్యక్తుల పరిచయం మీ పురోభివృద్ధికి తోడ్పడుతుంది. మధ్యవర్తిత్వం వహించండం వల్ల గుర్తింపు లభిస్తుంది. 
 
సింహం : దంపతుల మధ్య పరస్పర అవగాహన అభివృద్ధి కానవస్తుంది. కిరాణా, ఫ్యాన్సీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు లాభదాకయం. స్త్రీలకు అలంకరణ, విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఏసీ, ఇన్వెర్టర్, ఎలక్ట్రానిక్ రంగాల వారికి పురోభివృద్ధి. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభించగలవు. 
 
కన్య : బంధువుల రాకపోకలతో గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యులతో అత్యంత సన్నిహితంగా మెలగడం వల్ల లబ్ధి చేకూరే అవకాశం ఉంది. అవివాహితులతో నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. 
 
తుల : మీ ఏమరుపాటుతనం, నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువలు చేజారిపోయే ఆస్కారం కలదు. జాగ్రత్త వహించండి. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాలలో మెలకువ వహించండి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల సంతృప్తినిస్తాయి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో ఊహించని సమస్యలు తలెత్తుతాయి. 
 
వృశ్చికం : తలపెట్టిన పనిలో కొంతముందువెనుకలుగానైనా సంతృప్తి కానరాగలదు. మీ లక్ష్యసాధనలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో కృషి చేయడం వల్ల సత్ఫలితాలు పొందుతారు. స్త్రీలకు రచనలు, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తుల శ్రమకు తగిన ప్రతిఫలం, ప్రోత్సాహం లభిస్తాయి. 
 
ధనస్సు : వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు మెలకువ అవసరం. ఎన్ని అవరోధాలు తలెత్తినా వ్యాపార రంగంలో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. మిత్రుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదాపడటంతో కొంత నిరుత్సాహానికి గురవుతారు. చిన్నతరహా, కుటీర పరిశ్రమలు, చిరు వ్యాపారులకు అభివృద్ధి కానరాగలదు. 
 
మకరం : ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి అనుకున్న పనుల్లో ఆటంకాలు తప్పవు. ఏ ప్రతిఫలాపేక్షా లేకుండా మీరు చేసిన సహాయానికి మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థుల ఆలోచనలు పక్కదారి పట్టకుండా మెలకువతో వ్యవహరించవలసి ఉంటుంది. ప్రేమానుబంధాలు, సంబంధ బాంధవ్యాలు మరింత బలబడతాయి. 
 
కుంభం : ఉద్యోగస్తులకు అధికారులతో పరస్పర అవగాహన కుదరదు. మీ యత్నాలలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా అడుగు ముందుకేయండి. నిరుద్యోగులు ఓర్పు, నేర్పుతో విజయాన్ని సాధించగలరు. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెలకువ వహించండి. కీలకమైన చర్చలు, ఒప్పందాలు విషయంలో మెలకువ వహించండి. 
 
మీనం : ఇతరుల కారణంగా భాగస్వాముల మధ్య పరస్పర అవగాహన లోపిస్తుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు త్వరలోనే ఒక మంచి అవకాశం లభించే ఆస్కారం ఉంది. బంధువర్గాల నుంచి ఆసక్తికరమైన సమాచారం అందుకుంటారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటిపైనే శ్రద్ధ వహించండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డబ్బు కోసం బాయ్‌ఫ్రెండ్‌ను కిడ్నాప్ చేసిన ప్రియురాలు

ఏపీ మద్యం కేసు : అట్టపెట్టెల్లో దాచిన కరెన్సీ కట్టలు స్వాధీనం

రష్యా తీరంలో భారీ భూకంపం... సునామీ హెచ్చరికలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

అన్నీ చూడండి

లేటెస్ట్

varalakshmi vratham 2025 ఆగస్టు 8 వరలక్ష్మీ వ్రతం, ఏం చేయాలి?

29-07-2025 మంగళవారం ఫలితాలు - పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు...

Sravana Mangalavaram: శ్రావణ మాసం.. మంగళగౌరీ వ్రతం చేస్తే ఏంటి ఫలితం?

Garuda Panchami 2025: గరుడ పంచమి రోజున గరుత్మండుని పూజిస్తే.. సర్పదోషాలు మటాష్

Nag Panchami 2025: నాగపంచమి రోజున నాగుల పూజ ఎందుకు.. కుండలినీ శక్తిని?

తర్వాతి కథనం
Show comments