Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 13 March 2025
webdunia

21-05-2020 గురువారం దినఫలాలు - సాయిబాబాను ఆరాధించడం వల్ల...

Advertiesment
21-05-2020 గురువారం దినఫలాలు - సాయిబాబాను ఆరాధించడం వల్ల...
, గురువారం, 21 మే 2020 (05:00 IST)
మేషం : వ్యాపారాల్లో నష్టాలు, ఆటుపోట్లు తొలగి గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థల సిబ్బందికి ఒత్తిడి, శ్రమ అధికమవుతుంది. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. 
 
వృషభం : ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఉద్యోగస్తుల శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన చాలా మంచిది. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. 
 
మిథునం: స్త్రీలపై బంధువులు, చుట్టుపక్కల వారి ప్రభావం అధికంగా ఉంటుంది. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికమవుతుంది. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. మీ సంతానం పై చదువుల కోసం పొదుపు పథకాలు చేపడతారు. ప్రయత్నపూర్వకంగా ఒక అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. 
 
కర్కాటకం : స్త్రీల ఏమరుపాటుతనం ఇబ్బందులకు దారితీస్తుంది. ప్రేమికులు అతిగా వ్యవహరించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు. వృత్తిరీత్యా ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదాపడతాయి. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. 
 
సింహం : ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి తోడ్పడతాయి. మీ పట్టుదల, ఉత్సాహం ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. బ్యాంకు వ్యవహారాలలో హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. కొబ్బరి, పండ్లు, పానీయ, చిరు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. దూరపు బంధువుల ఆకస్మిక రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. 
 
కన్య : వస్త్ర, ఫ్యాన్సీ, మందులు, పచారీ వ్యాపారులకు పురోభివృద్ధి. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల పట్ల ఏమంత ఉత్సాహం ఉండదు. ముఖ్యమైన వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు పుట్టింటివారి నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. 
 
తుల : ఆత్మీయులు, సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. నిరుద్యోగులు, ఉపాథి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. వ్యాపారాల అభివృద్ధికి కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. దూర ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. 
 
వృశ్చికం : రవాణా రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. రావలసిన ధనం అందకపోవడం వల్ల నిరుత్సాహానికి లోనవుతారు. రేషన్ డీలర్లకు అధికారుల నుంచి వేధింపులెదురవుతాయి. ఒప్పందాలు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో పెద్దలను సంప్రదించండి. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. 
 
ధనస్సు : బంధువులతో మితంగా సంభాషించడం మంచిది. ఏ పని మొదలెట్టినా అసంపూర్ణంగా ముగించవలసి వస్తుంది. ప్రలోభాలకు లొంగవద్దు. ప్రైవేటు సంస్థలలోని వారు ఎంత శ్రమించినా యాజమాన్యాన్ని మెప్పించడం కష్టమవుతుంది. విద్యార్థుల్లో మనోధైర్యం నెలకొంటుంది. వాయిదాపడిన మొక్కుబడులు తీర్చుకుంటారు. 
 
మకరం : ముఖ్యమైన వ్యవహారాలు, కొనుగోళ్ళు మీరే చూసుకోవడం మంచిది. ప్రముఖుల కోసం నిరీక్షించవలసి వస్తుంది. భాగస్వామికులతో అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులకు కొత్త అధికారులతో సంబంధాలు బలపడతాయి. దూర ప్రయాణాలు, పుణ్యక్షేత్ర సందర్శనలకు పథకాలు రూపొందిస్తారు. 
 
కుంభం : ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత ముఖ్యం. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. బ్యాంకు పనుల్లో జాప్యం ఇతర కార్యక్రమాలపై ప్రభావం చూపుతుంది. పత్రికా రంగంలోని వారి ఏమరుపాటు వల్ల ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. మిత్రులను కలుసుకుంటారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
మీనం : ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలపై దృష్టిసారిస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. విందులలో పరిమితి పాటించండి. రాజకీయాల్లోని వారికి విరోధుల వల్ల ఒత్తిడి, ఆందోళన తప్పదు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెట్లకింద చీపుర్లు పెడుతున్నారా... ఐతే వెంటనే తీసేయండి..