Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుక్రవారం (18-05-2018) దినఫలాలు... ఇతరులపై ఆధారపడక స్వయంకృషినే...

మేషం: సన్నిహితుల నుండి అన్నివిధాలా సహకారం, ప్రోత్సాహం లభిస్తాయి. కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారులకు పురోభివృద్ధి. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. రచయితలకు, కళాకారులకు సదవకాశాలు లభిస్తాయి. గృహంలో మార

Webdunia
శుక్రవారం, 18 మే 2018 (08:26 IST)
మేషం: సన్నిహితుల నుండి అన్నివిధాలా సహకారం, ప్రోత్సాహం లభిస్తాయి. కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారులకు పురోభివృద్ధి. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. రచయితలకు, కళాకారులకు సదవకాశాలు లభిస్తాయి. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు ధ్యేయం పట్ల మరింత శ్రద్ధ ఏర్పడుతుంది.
 
వృషభం: చిన్నతరహా, కుటీర పరిశ్రమలు, చిరువ్యాపారులకు అభివృద్ధి కానరాగలదు. విద్యార్థులకు విద్యా విషయాల్లో ఏకాగ్రత అవసరం. దైవదర్శనాలు అనుకూలిస్తాయి. ఏదైనా అమ్మకానికై చేయు ప్రయత్నం వాయిదా వేయడం మంచిది. స్పెకులేషన్ రంగాల వారికి కలిసిరాగలదు. ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. 
 
మిథునం: ఆర్థిక సమస్యలు నుంచి విముక్తులవుతారు. స్త్రీల ఆరోగ్యంలో సంతృప్తి కానరాదు. మీ ఆలోచనలు, పథకాలు కార్యరూపం దాల్చుతాయి. ప్రియతముల కోసం మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. వృత్తి, వ్యాపారులకు ప్రోత్సాహకరం. కొంతమంది మీ నుంచి సమాచారం సేకరించటానికి యత్నిస్తారు. 
 
కర్కాటకం: విద్యార్థులకు క్రీడలు, ఇతర వ్యాపకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తాయి. ప్రయాణాలలో సంతృప్తి కానరాదు. వ్యాపారాలు, స్థిరచరాస్తుల అభివృద్ధికై చేయు కృషిలో సఫలీకృతులౌతారు. నిరుద్యోగులకు మధ్యవర్తుల పట్ల అప్రమత్తత అవసరం.
 
సింహం: పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో చికాకులు తప్పవు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వృత్తుల వారికి సామాన్యం. అక్కౌంట్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. మీ జీవితభాగస్వామి సలహా పాటిస్తారు. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులకు అనుకూలిస్తాయి.
 
కన్య: ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులకు పదోన్నతి లభించే ఆస్కారం ఉంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. ఇసుక కాంట్రాక్టర్లకు ఊహించని ఆటంకాలెదురవుతాయి. దైవ, సేవా సాంఘిక కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. అకాల భోజనం, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది.
 
తుల: మీ నుంచి కొంత మంది ధనసహాయం ఆశిస్తారు. ఉపాధ్యాయులకు సదవకాశాలు లభిస్తాయి. భాగస్వామిక చర్చలు, కోర్టు వ్యవహారాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు, ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. రాజకీయనాయకులు సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. 
 
వృశ్చికం: భాగస్వామిక చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారం అందుతుంది. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి. పత్రిక, వార్తా సంస్ధలలోని వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి.
 
ధనస్సు: బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. బంధువుల రాకతో గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ఎదుటివారితో విుతంగా సంభాషించటం మంచిది. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువులపై మక్కువ పెరుగుతుంది. ఏ విషయంలోను ఇతరులపై ఆధారపడక స్వయంకృషినే నమ్ముకోవటం మంచిది.
 
మకరం: స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడి వల్ల ఆందోళనలకు గురవుతారు. నోరు అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. బంధువుల రాకతో ఖర్చులు అధికం. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. మీ సంతానం మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. 
 
కుంభం: ఎ.సి, కూలర్లు, ఇన్వెర్టర్ రంగాలలో వారికి శుభదాయకంగా ఉంటుంది. కాంట్రాక్టర్లకు పనివారలతో చికాకులు తప్పువు. దైవ, సేవా, పుణ్యకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. విపరీతమైన ఖర్చులు, శ్రమాధిక్యత వల్ల మనస్సు నిలకడగా ఉండదు.
 
మీనం: తలపెట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. వ్యాపారులు కొనుగోలుదార్లతో చికాకులు, సమస్యలు ఎదుర్కుంటారు. శత్రువులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి బాకీలు వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sunita Williams: సురక్షితంగా భూమికి తిరిగి వచ్చిన సునీతా విలియమ్స్.. ఆమెతో పాటు నలుగురు (video)

Posani: జైలు గేటు దగ్గర పోసానీతో సెల్ఫీలు తీసుకున్న సీఐడీ ఆఫీసర్లు.. ఏంటిది? (video)

ఏప్రిల్ 1 వరకు వల్లభనేని వంశీకి రిమాండ్.. మెట్రెస్, ఫైబర్ కుర్చీ ఇవ్వలేం

Jagan With Vijayamma: వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ అంత్యక్రియలకు విజయమ్మ-జగన్

Krystyna Pyszkova: యాదగిరి గుట్టలో మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్జ్కోవా (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

16-03-2025 నుంచి 22-03-2025 వరకు మీ వార ఫలితాలు-ఆర్థికంగా ఆశించిన ఫలితాలుంటాయి.

Gangaur Vrat: గంగౌర్ గౌరీ పూజ పార్వతీ పరమేశ్వరులకు అంకితం.. ఇలా చేస్తే?

15-03-2025 శనివారం ఆస్ట్రాలజీ - పత్రాల రెన్యువల్లో జాగ్రత్త వహించండి...

Chanakya Niti: భార్యాభర్తలిద్దరూ కలిసి చేయకూడని ఆ 4 పనులు.. ఏంటవి?

Lakshmi Jayanti : హోలీ రోజునే శ్రీలక్ష్మి జయంతి- శుక్రవారం వచ్చింది.. ఇవన్నీ చేస్తే ఐశ్వర్యం మీ సొంతం..

తర్వాతి కథనం
Show comments