Webdunia - Bharat's app for daily news and videos

Install App

17-08-2019- శనివారం రాశి ఫలితాలు

Webdunia
శనివారం, 17 ఆగస్టు 2019 (11:35 IST)
మేషం: బ్యాంకింగ్, ఫైనాన్సు, చిట్స్ వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలు తలెత్తుతాయి. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలబడతారు. స్త్రీలు పట్టుదలకు పోకుండా పరిస్థితులకు అనుగుణంగా మెలగవలసి ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. 
 
వృషభం: రాజకీయాలలో వారికి విరోధుల వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. బంధుమిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. కాంట్రాక్టర్లకు చేపట్టిన పనులలో చికాకులు తప్పవు. ఆత్మీయులకు మీ సమస్యలు చెప్పుకోవడం వల్ల ప్రయోజనం ఉంది. పెద్దల ఆరోగ్య, ఆహార వ్యవహారాలలో మెళకువ అవసరం.
 
మిథునం: రాజకీయాల వారికి పార్టీపరంగాను, అన్నివిధాలా కలిసివస్తుంది. వృత్తి ఉద్యోగములందు ఆదాయం బాగుంటుంది. దంపతుల మధ్య కలహాలు అధికమవుతాయి. పెద్దల ఆరోగ్యము మందగిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం. బ్యాంకులు ఆర్ధిక సంస్ధలతో పనులు వాయిదా పడతాయి.
 
కర్కాటకం: ప్రైవేటు సంస్థలలోని వారికి పనిభారం అధికమవుతుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభాదాయకం. బ్యాంకు వ్యవహారాల్లో మెళుకువ, ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తులకు హోదా పెరగటంతో పాటు అదనపు బాధ్యతలు అప్పగించబడతాయి. రవాణా రంగాలలో వారికి శ్రమకు తగిన ఫలితం కానవస్తుంది.
 
సింహం: కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. ప్రముఖులను కలుసుకుంటారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళుకువ అవసరం.
 
కన్య: ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. తలపెట్టిన పనుల్లో ఒడిదుడుకులను ఎదుర్కుంటారు. రాబడికి మించి ఖర్చులు అధికమవుతాయి. వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. బంధుమిత్రులలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
తుల: వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలు దార్లను ఆకట్టుకుంటారు. సోదరీ, సోదరులతో ఏకీభవించలేరు. ఉపాధ్యాయులు సభ, సమావేశాల్లో పాల్గొంటారు. హోటల్, క్యాటరింగ్ పనివారలకు సదవకాశాలు లభిస్తాయి. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. మీ అలవాట్లు, బలహీనతలు గోప్యంగా ఉంచటం క్షేమదాయకం.
 
వృశ్చికం: ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. ఉద్యోగస్తులకు అధికారులతో సమన్వయం లోపిస్తుంది. మీ కళత్ర ఆరోగ్యము గురించి ఆందోళన చెందుతారు. ఖర్చులు మీ ఆదాయానికి తగినట్లుగానే ఉంటాయి. విద్యార్థులు స్వయం కృషితో బగా రాణిస్తారు. లిటిగేషన్ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. 
 
ధనుస్సు: బంధువులతో చిన్న చిన్న కలహాలు జరిగే ఆస్కారం ఉంది. కొబ్బరి, కూరలు, పండ్లు, పూల వ్యాపారస్థులకు సంతృప్తికరంగా ఉంటుంది. రాజకీయాలలో వారికి విరోధుల వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. కాంట్రాక్టర్లకు చేపట్టిన పనులలో ఒత్తిడి, చికాకులు తప్పవు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది.
 
మకరం: క్రయ విక్రయ రంగాలలోని వారికి సంతృప్తికానవస్తుంది. బ్యాంకింగ్ రంగాల వారికి పనిలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. స్టేషనరీ, ప్రింటింగు రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో చురుకుదనం కానవస్తుంది. స్త్రీలకు నూతన సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
కుంభం: ఆర్ధిక విషయంలో ఒక అడుగు ముందుకు వేస్తారు. స్త్రీలు అపరిచిత వ్యక్తులతో మితంగా సంభాషించడం మంచిది. విదేశాల్లోని ఆత్మీయులకు ప్రియమైన వస్తుసామగ్రిని అందజేస్తారు. తలపెట్టిన పనిలో సంతృప్తి, జయం చేకూరగలదు. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పవు.
 
మీనం: ఆర్ధిక విషయంలో ఒక అడుగు ముందుకు వేస్తారు. రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ లక్ష్యం నెరువేరుతుంది. ప్రముఖులను కలుసుకుంటారు. రిప్రజెంటెటివులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. పత్రిక, ప్రైవేటు సంస్థల్లో వారు మార్పులకై చేయు యత్నాల్లో సఫలీకృతులౌతారు. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

పూజ చేస్తున్న సమయంలో మంటలు.. గాయపడిన గిరిజా వ్యాస్

డామిట్ కథ అడ్డం తిరిగింది... కోడలిని మొదటి భర్త వద్దకు పంపిన అత్తగారు!!

మయన్మార్ భూకంపం : 2700 దాటిన మృతుల సంఖ్య... మరింతగా పెరిగే ఛాన్స్..!!

అన్నీ చూడండి

లేటెస్ట్

31-03-2025 సోమవారం మీ రాశిఫలాలు : స్థిమితంగా ఉండటానికి యత్నించండి...

30-03-2025 ఆదివారం దినఫలితాలు - ఆర్థిక సమస్య కొలిక్కి వస్తుంది..

Ugadi 2025: శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం.. విశేష ధనం లభిస్తుందట..

30-03-2025 నుంచి 05-04-2025 వరకు మీ వార రాశి ఫలితాలు..దంపతుల మధ్య అకారణ కలహం

29-03-2025 శనివారం దినఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం...

తర్వాతి కథనం
Show comments