Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

15-08-2019- గురువారం రాశిఫలాలు : కుటుంబ సభ్యులతో...

Advertiesment
Daily Horoscope
, గురువారం, 15 ఆగస్టు 2019 (08:36 IST)
మేషం: విద్యార్థులు ప్రముఖుల నుండి బహుమతులు అందుకుంటారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు విశ్రాంతి పొందుతారు. ఉపాధ్యాయుల శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు శుభదాయకంగా ఉంటుంది. 
 
వృషభం: కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకోండి. స్ధిరాస్తి అమ్మకంపై ఒత్తిడి వల్ల ఆందోళనలకు గురువుతారు.
 
మిథునం: అందరితో కలసి విందు, వినోదాలలో పాల్గొంటారు. ఉపాధ్యాయులు విశ్రాంతిని పొందుతారు. గృహనిర్మాణాలు చేపడతారు. ముఖ్యమైన విషయాలను గురించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. పాత మిత్రుల కలయిక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.
 
కర్కాటకం: విద్యార్థులు క్విజ్, పోటీలలో పాల్గొని విజయం సాధిస్తారు. స్త్రీలకు ఆర్థిక పరమైన సమస్యలు అధికమవుతాయి. ఏజెంట్లకు, బ్రోకర్లకు ఆశించినంత పురోగతి ఉండదు. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. కాంట్రాక్టర్లకు పనివారితో సమస్యలు తప్పవు. క్రయ విక్రయ లాభదాయకంగా ఉంటాయి.
 
సింహం: కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. ఉత్తర ప్రత్యుత్తరాలు, సంప్రదింపుల విషయంలో సంతృప్తి కానరాగలదు. వివాహ యత్నాలలో సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. వ్యాపారులకు పోటీ పెరగటంతో ఆశించింనంత ఆర్ధిక సంతృప్తి ఉండదని గమనించండి.
 
కన్య: చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వాయిదా పడిన మొక్కుబడులు తీర్చుకుంటారు. ఉపాధ్యాయులు పనిలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. డబ్బుపోయినా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. స్త్రీల సరదాలు, అవసరాలు వాయిదా వేసుకోవలసివస్తుంది.
 
తుల: ఆర్థిక లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు ప్రశాంతంగా సాగుతాయి. ఫైనాన్స్, చిట్‌ఫండ్‌ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. విద్యార్థులు విదేశాల్లో పై చదువుల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి శ్రమించిన సత్ఫలితాలు లభిస్తాయి. శ్రీమతి ప్రోద్భలంతో ఒక శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు.
 
వృశ్చికం: విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. పనులు, వ్యవహారాల్లో ప్రతికూలతలుంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఒక వ్యవహారం నిమత్తం ప్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు. దూరప్రయాణాల్లో చికాకులు తప్పవు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. 
 
ధనస్సు: వ్యాపారాల్లో నష్టాలను అధిగమిస్తారు. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. ఏ అవకాశం కలిసిరాక నిరుత్సాహం చెందుతారు. ఒప్పందాలు, నగదు చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. శ్రమాధిక్యతతో పనులు పూర్తి చేస్తారు.
 
మకరం: ఉద్యోగ యత్నంలో బిడియం, భేషజం తగదు. వ్యాపారాల్లో ఆటంకాలను అధిగమిస్తారు. నూతన పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణలకు సమయం కాదు. ఆత్మీయుల ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. ఏజెన్సీలు, లీజు, కాంట్రాక్టలకు అనుకూలం. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. 
 
కుంభం: దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. దళారులను విశ్వసించవద్దు. ఖర్చులు పెరిగినా భారమనిపించవు. మీ మాటకు సర్వత్రా మంచి స్పందన లభిస్తుంది. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. మీ అంచనాలు, ఊహలు ఫలిస్తాయి. వేడుకలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు.
 
మీనం: వ్యాపారాల విస్తరణలు, ప్రాజెక్టులు, సంస్థలకు అనుమతులు మంజూరవుతాయి. మీ వ్యాఖ్యలను బంధుమిత్రులు అపార్ధం చేసుకుంటారు. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు పనివారలతో చికాకులు అధికం. ఎరువుల డీలర్లు, వ్యాపారులకు అధికారులతో సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తిష్టవేసుకుని వుంటుందట...