Webdunia - Bharat's app for daily news and videos

Install App

12 రాశుల వారు దర్శించుకోవాల్సిన శివాలయాలు ఏంటో తెలుసా? (video)

Webdunia
శుక్రవారం, 16 ఆగస్టు 2019 (17:59 IST)
12 రాశులకు చెందిన జాతకులు.. రాశులకు అనుగుణంగా ఏ శివాలయాన్ని దర్శించుకోవాలో తెలుసుకోవాలనుందా..? ఐతే ఈ స్టోరీ తప్పక చదవాల్సిందే. మహాశివరాత్రి లేదా మాస శివరాత్రి, అలాగే సోమవారాల్లో శివుడిని పూజించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.


అలాగే 12 రాశుల వారు రాశికి అనుగుణమైన శైవక్షేత్రాన్ని సందర్శించడం ద్వారా ఈతిబాధలు వుండవు. ఆయుర్దాయం పెరుగుతుంది. ఆర్థికాభివృద్ధి వుంటుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 
 
ఇందులో భాగంగా మేషరాశి వారు కొండపై వెలసిన శివాలయాలను దర్శించుకోవడం ఉత్తమం. ముఖ్యంగా అరుణాచల క్షేత్రాన్ని దర్శించుకోవడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. 
 
అలాగే వృషభ రాశి జాతకులు.. తిరువారూరు శివాలయాన్ని దర్శించుకోవడం మంచిది. 
మిథునరాశి జాతకులు.. చిదంబరం, శ్రీ కాళహస్తీశ్వరాలయాన్ని దర్శించుకోవడం శుభప్రదం.
కర్కాటకం.. తిరుక్కడయూర్, వేలూరులోని జలకండేశ్వర స్వామిని దర్శించుకుని పూజించడం మంచి ఫలితాలను ఇస్తుంది. 
సింహ రాశి.. చిదంబరం, అరుణాచల క్షేత్రం 
 
కన్యారాశి వారు.. కాంచీపురం ఏకాంబరనాధ స్వామిని, మదురై మీనాక్షి చొక్కనాథ స్వామిని దర్శించుకోవటం అనుకున్న కార్యాలను దిగ్విజయం చేస్తుంది. 
తులారాశి.. చిదంబరం, శ్రీ కాళహస్తి, మదురై ఆలయాన్ని దర్శించుకోవడం మంచిది. 
వృశ్చిక రాశి జాతకులు.. అరుణాచల స్వామిని దర్శించటం ఉత్తమం. 
మకర రాశి.. కాంచీపురం ఏకాంబరేశ్వర స్వామి 
కుంభం.. చిదంబరం, శ్రీ కాళహస్తి, 
 
మీనం.. వేదారణ్యం, జలకండేశ్వర స్వామిలను దర్శించుకుంటే ఆదాయాభివృద్ధి చేకూరుతుంది. అలాగే ఈ ఆలయాలను సందర్శించుకోవడంతో పాటు పూజా వస్తువులను కొనివ్వడం, చెరకు రసంతో అభిషేకం చేయించడం, పంచాక్షర మంత్రంతో జపించడం వంటివి చేస్తే.. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తికావడంతో పాటు.. మానసిక ఉత్సాహం చేకూరుతుందని పండితులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అయ్య బాబోయ్..అదానీ గ్రూప్‌తో ప్రత్యక్ష ఒప్పందం కుదుర్చుకోలేదు.. వైకాపా

అదానీ దేశం పరువు తీస్తే జగన్ ఏపీ పరువు తీశారు : వైఎస్.షర్మిల (Video)

ఎగ్జిట్ పోల్ ఫలితాలు 2024 : ఆ రెండు రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటే...

పెరుగుతున్న సముద్ర నీటి మట్టాలు.. ప్రమాదం ముంగిట తీర ప్రాంతాలు!

కారు యజమానిని వణికించిన కాకులు - వీడియో వైరల్

అన్నీ చూడండి

లేటెస్ట్

భైరవ అష్టమి మహోత్సవం, 2024 రకాల మిఠాయిల భోగం, 84,000 చదరపు అడుగుల రంగోలీ ప్రపంచ రికార్డు

20-11-2024 బుధవారం ఫలితాలు - గృహం ప్రశాంతంగా ఉంటుంది...

19-11-2024 మంగళవారం ఫలితాలు - పిల్లల దూకుడు కట్టుడి చేయండి....

సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే?

మంగళవారం సంకష్ట హర చతుర్థి.. కుజదోషాలు మటాష్

తర్వాతి కథనం
Show comments