Webdunia - Bharat's app for daily news and videos

Install App

15-06-2020 సోమవారం దినఫలాలు - ఆదిశంకరుడిని పూజిస్తే సంకల్ప సిద్ధి...

Webdunia
సోమవారం, 15 జూన్ 2020 (05:00 IST)
మేషం : ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అవివాహిత యువకులకు అందిన ఒక సమాచారం నిరుత్సాహం కలిగిస్తుంది. వాణిజ్య ఒప్పందాలు, రిజిస్ట్రేషన్లు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు ఒక కొలిక్కిరాగలవు. 
 
వృషభం : విదేశీయాన యత్నాలు నెరవేరగలవు. కాంట్రాక్టులకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. ఆత్మీయుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుకుంటారు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి. నిరుద్యోగ యత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. ఆస్తి వ్యవహారాలు పరిష్కారమవుతాయి. 
 
మిథునం : ఎల్.ఐ.సి, పోస్టల్ ఏజెంట్లకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఉమ్మడి వెంచర్లు, భాగస్వామిక వ్యాపారాలు సామాన్యంగా నడుస్తాయి. విద్యార్థులకు తొందరపాటు తగదు. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. 
 
కర్కాటకం : కళ, క్రీడా, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరం. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. విద్యార్థినులతో నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. రుణం తీర్చడానికి చేయు యత్నాలు ఫలిస్తాయి. మీ సంతానం కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. 
 
సింహం : వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవవుండగు. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. కోర్టు వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి. స్త్రీలపై పొరుగువారి వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపుతాయి. ప్రైవేటు సంస్థలలోని వారికి తోటివారి తీరు ఇబ్బంది కలిగిస్తుంది. 
 
కన్య : చిన్నతరహా పరిశ్రమలు, వృత్తులవారికి ఆశాజనకం. కొంతమంది మీ ఆలోచనలు పక్కదారి పట్టించేందుకు యత్నిస్తారు. ఆస్తి పంపకాలకు సంబంధించి సోదరులతో ఒక అవగాహన కుదుర్చుకుంటారు. పండ్లు, పానీయ వ్యాపారులకు పురోభివృద్ధి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత. ప్రయాసలు తప్పవు. 
 
తుల : వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలను ఇస్తాయి. వృత్తుల వారికి ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలించవు. బంధువుల రాకతో స్త్రీలలో ఉత్సాహం చోటుచేసుకుంటుంది. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిదికాదు. 
 
వృశ్చికం : ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత లోపిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో చికాకులెదురవుతాయి. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటుంది. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు ఫలిస్తాయి. 
 
ధనస్సు : ఉద్యోగస్తులకు పనిభారం, ఒత్తిడి అధికమవుతుంది. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. స్త్రీలకు అలంకారాలు, అలంకరణల పట్ల మక్కువ పెరుగుతుంది. సమావేశాలు, చర్చల్లో కొందరి తీరు మనస్తాపం కలిగిస్తుంది. విద్యార్థులు భయాందోళనలు వీడి శ్రమించిన ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. 
 
మకరం : ప్రైవేటు సంస్థలలోని వారు ఓర్పుతో పని చేయవలసి ఉంటుంది. గృహ నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. విందులు, వినోదాలలో అందరినీ ఆకట్టుకుంటారు. కొబ్బరి, పండ్లు, పూల, పానీయ, చిరు వ్యాపారులకు ఆశాజనకం. నిరుద్యోగ యత్నాలు కలిసిరాగలవు. పత్రికా, వార్తా సంస్థలలోని వారికి సామాన్యంగా ఉంటుంది. 
 
కుంభం : ఉద్యోగస్తుల బరువు బాధ్యతలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. వృత్తుల వారికి ఆశాజనకం. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత చాలా అవసరం. కుటుంబీకుల మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. అవివాహితులకు ఆశించిన సంబంధాలు నిశ్చయం కాగలవు. 
 
మీనం : ఆర్థిక సమస్యలు, కుటుంబంలో చికాకులు సర్దుకుంటాయి. వస్త్రలాభం, వాహనయోగం వంటి శుభపరిణామాలు ఉంటాయి. కార్యసాధనలో ఆటంకాలు అధికమిస్తారు. ఒక శుభకార్యానికి అనువైన వాతావరణం నెలకొంటుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగ యత్నాలు కలిసిరాగలవు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

లేటెస్ట్

11-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : ఆశలు ఒదిలేసుకున్న ధనం?

11 శుక్రవారాలు ఇలా శ్రీ మహాలక్ష్మీ పూజ చేస్తే.. ఉత్తర ఫాల్గుణి రోజున?

10-04-2025 గురువారం మీ రాశిఫలాలు : ఇంటిని అలా వదిలి వెళ్లకండి

ఇంట్లో శివలింగాన్ని పూజించవచ్చా? బొటనవేలు కంటే పొడవు వుండకూడదు

పండుగలు చేసుకోవడం అంటే ఏమిటి?

తర్వాతి కథనం
Show comments