Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

10-06-2020 బుధవారం దినఫలాలు - నారాయణుడిని ఎర్రని పూలతో పూజిస్తే...

Advertiesment
Daily Horoscope
మేషం : పరిచయంలేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. నరాలకు, ఎముకలకు సంబంధించిన చికాకులు తప్పవు. మీ ఇంటిని కొత్తగా మలచుకోవాలన్న ఆశ నెరవేరదు. స్త్రీలకు షాపింగ్, వ్యవహారాలు, అపరిచిత వ్యక్తుల విషయంలోనూ అప్రమత్తత అవసరం. బ్యాంకింగ్ రంగాల వారికి పనిలో ఒత్తిడి, చికాకులు తప్పవు. 
 
వృషభం : మీ చిన్నారుల భవిష్యత్ గురించి తగు శ్రద్ధ తీసుకుంటారు. రాజకీయ నాయకులు, సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతారు. స్త్రీలు అందరి యందు కలుపుగోలుతనంగా వ్యవహరించడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. 
 
మిథునం : కొత్త వ్యాపారాలు ప్రారంభించే ముందు అన్ని క్షుణ్ణంగా పరిశీలించండి. స్త్రీలు పట్టుదలతో సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకుంటారు. మిమ్మల్ని పొగిడేవారే కానీ సహకరించేవారుండరు. ఉపాధ్యాయులకు నూతన వాతావరణం నిరుత్సాహం కలిగిస్తుంది. మీ వాహనం ఇతరులకిచ్చి విషయంలో లౌక్యంగా వ్యవవహరించండి. 
 
కర్కాటకం : పుణ్యక్షేత్రాల దర్శన వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ప్రతి విషయం మీ జీవిత భాగస్వామికి తెలియజేయడం మంచిది. కోర్టు వ్యవహారాలలో మెళకువ అవసరం. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక సమస్యను అధికమిస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాకయకంగా ఉంటుంది. 
 
సింహం : దైవ, సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణాలు శ్రేయస్కరం కాదని గమనించండి. అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. కుటుంబ సమస్యలను పట్టించుకోకుండా ఇతరుల సహాయం చేస్తారు. స్థిరాస్తి అమ్మకం విషయంలో పునరాలోచన మంచిది. 
 
కన్య : స్త్రీలకు అర్జన పట్ల ఆసక్తి, అందుకు అనువైన పరిస్థితులు నెలకొంటాయి. వార్తా సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. బంధు మిత్రులు నుంచి అవమానాలు ఎదుర్కొంటారు. కుటుంబీకులతో కలిసి దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. హోటల్, తినుబండరాలు, క్యాటరింగ్ పనివారలకు శుభదాకయం. 
 
తుల : నిరుద్యోగులు అవకాశాల కోసం వేచి ఉండాలి. సంస్థల నుంచి రుణం మంజూరవుతుంది. ముక్కుసూటిగా పోయే మీ తీరును విమర్శలకు దారితీస్తుంది. వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యంలో స్వల్ప తేడాలు ఉంటాయి. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. దంపతులకు ఏ విషయంలోనూ పొత్తు కుదరదు. 
 
వృశ్చికం : విద్యార్థులకు బజారు తినుబండారాలు భుజించుట వల్ల అస్వస్థతకు లోనవుతారు. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవడం మంచిది కాదు. మీకు అందిన చెక్కులు చెల్లక ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్త్రీలకు టీవీ ఛానెళ్ళ నుంచి ఆహ్వానం, బహుమతులు అందుతాయి. బాకీలు, ఇంటి అద్దెలు లౌక్యంగా వసూలు చేసుకోవాలి. 
 
ధనస్సు : ఉపాధ్యాయులకు యాదృచ్ఛికంగా దుబారా ఖర్చులు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపార వర్గాల వారికి ఖాతాదారులతో సమస్యలు తలెత్తుతాయి. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పట్టుదల అధికమవుతుంది. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. 
 
మకరం : కౌన్సెలింగ్‌లో కోరుకున్న విద్యావకాశం లభిస్తుంది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు మీపై శకునాలు తీవ్ర ప్రభావం చూపుతాయి. బంధువులు మీ నుంచి పెద్ద మొత్తంలో ధనసహాయం అర్థిస్తారు. వ్యాపార వర్గాల వారికి అధికారుల తనిఖీలు, షాపు గుమస్తాల నిర్లక్ష్యం ఆందోళన కలిగిస్తాయి. 
 
కుంభం : ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. ఖర్చులు సామాన్యం. తేలికగా పూర్తయ్యే పనుల కోసం అధికంగా శ్రమించవద్దు. ప్రముఖుల ఇంట్వ్యూల కోసం పడిగాపులు తప్పవు. మీ వ్యాపకాలు తగ్గించుకుని కుటుంబ విషయాలపై దృష్టిసారించాలి. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి గడిస్తారు. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. 
 
మీనం : కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. ఖర్చులు సామాన్యంగా ఉంటాయి. బ్యాంకింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. రుణం తీర్చి తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు. ఉద్యోగస్తులకు పై అధికారులనుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

09-06-2020 మంగళవారం మీ రాశి ఫలితాలు..