మేషం : ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. కిరాణా, ఫ్యాన్సీ, మందులు, సుగంధ ద్రవ్య, ఆల్కహాలు వ్యాపారులకు అభివృద్ధి కానవస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో ఆశించిన మార్పు, గృహ ప్రశాంతత పొందుతారు. టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు.
వృషభం : మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. ప్రతిఫలాపేక్ష లేకుండా మీరు చేసిన ఉపకారానికి ప్రశంసలు లభిస్తాయి. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభిస్తాయి. తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. మీ ఉన్నతిని చాటుకోవడానికి ధనం విరివిగా వ్యయం చేయవలసి వస్తుంది.
మిథునం : వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. ప్రతిఫలాపేక్ష లేకుండా చేసిన ఉపకారానికి ప్రశంసలు లభిస్తాయి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఆపరేషన్ల విషయంలో వైద్యులకు ఏకాగ్రత ముఖ్యం. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.
కర్కాటకం : బంధువుల రాక వల్ల కొంత అసౌకర్యానికి లోనవుతారు. పారిశ్రామిక రంగాల్లో వారు కార్మికులతో ఒప్పందానికి వస్తారు. నిబద్ధతతో పని చేస్తే అంతా విజయమే. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళకువ అవసరం. అనుకోని వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశను కలిగిస్తాయి. సోదరులతో పట్టింపులు తలెత్తుతాయి.
సింహం : ఆధ్యాత్మికసేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తవచ్చు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయలవలసి వస్తుంది. రుణ వాయిదాలు పూర్తిగా చెల్లించి తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు.
కన్య : నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల వల్ల నష్టపోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. శత్రువులు, మిత్రులుగా మారుతారు. ఉమ్మడి కుటుంబ విషయాలలో మాటపడాల్సి వస్తుంది. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి.
తుల : వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాల్సి ఉంటుంది. స్త్రీలతో మితంగా సంభాషించండి. గృహానికి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తారు. అరుదైన ఆపరేషన్లను వైద్యులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సభలు, సమావేశాలకు ధనం అధికంగా వ్యయం చేస్తారు. విద్యార్థులకు క్రీడా రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
వృశ్చికం : ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్, మెకానికల్ రంగాల వారికి అన్ని విధాలా కలిసిరాగలదు. భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. గతంలో జరిగిన తప్పుల నుంచి మంచిని నేర్చుకోండి. మీరెంత శ్రమించిన గుర్తింపు అంతంతమాత్రంగానే ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు.
ధనస్సు : విద్యుత్, ఏసీ, మెకానికల్ రంగాలలోని వారికి సంతృప్తి కానవస్తుంది. ఖర్చులు పెరగడంతో రుణ యత్నాలు, చేబదుళ్లు తప్పవు. రాజకీయ నాయకులకు ఊహించని అవరోధాలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. మీ అభిప్రాయాన్ని మీ శ్రీమతి ద్వారా తెలియజేయండి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు.
మకరం : బ్యాంకు వ్యవహరాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అవసరం. వృత్తి వ్యాపారాల్లో పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. దైవ, శుభకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. మీ శ్రీమతి కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదాపడతాయి.
కుంభం : శారీరకశ్రమ, అకాల భోజనం, వల్ల స్వల్ప అస్వస్థతకు లోనవుతారు. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనులలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. ప్రింటింగ్ రంగాల వారికి అచ్చుతప్పులు పడటం వల్ల మాటపడవలసి వస్తుంది. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది.
మీనం : ఉద్యోగ విరమణ చేసిన వారికి తోటివారు సాదరంగా వీడ్కోలు పలుకుతారు. ఉత్సాహంతో శ్రమించండి, అనుకున్నది సాధిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగలవలసి వస్తుంది. ఎగుమతి, దిగుమతి వ్యాపారస్తులకు, ఉమ్మడి వ్యాపారస్తుల శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.