Webdunia - Bharat's app for daily news and videos

Install App

14-01-2019 - భోగి పండుగ నాటి రాశి ఫలితాలు - ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం ఫలిస్తుంది...

Webdunia
సోమవారం, 14 జనవరి 2019 (09:46 IST)
మేషం: ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. రాజకీయ రంగాల్లో వారు ప్రత్యర్థుల వలన సమస్యలు ఎదుర్కుంటారు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. క్రీడా రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. హోటల్, తినుబండ వ్యాపారులకు, క్యాటరింగ్ రంగాల్లోవారికి సదవకాశాలు లభిస్తాయి.
 
వృషభం: ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల వారికి కలిసిరాగలదు. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రేమికుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. ప్రయాణాల వ్యవహారాలలో మెళకువ వహించండి. 
 
మిధునం: దైవ, పుణ్య కార్యాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. నిరుద్యోగుల యత్నాలు కలిసిరాగలవు. నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. మార్కెటింగ్ రంగాల వారికి పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. బంధువులను కలుసుకుంటారు. ఆరోగ్య విషయంలోను ఏకాగ్రత ఎంతో ముఖ్యం. 
 
కర్కాటకం: కుటుంబ, ఆర్థికస్థితిలు ఆశాజనకంగా ఉంటాయి. బంధువుల రాకతో పనులు వాయిదా పడడం మంచిది. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. ఊహించని ఖర్చులు అధికం కావడంతో స్వల్ప ఒడిదుడుకులు తప్పవు. దూరప్రయాణాల్లో మెళకువ వహించండి.  
 
సింహం: ఆర్థిక ఇబ్బంది అంటూ లేక పోయిన సంతృప్తి ఉండజాలదు. ఏదైనా అమ్మకానికై చేయు యత్నంలో సఫలీకృతులవుతారు. పుణ్యక్షేత్రాల దర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. స్త్రీలు అపరిచితుల పట్ల మెళకువ వహించండి. విద్యార్థుల విద్యా విషయాల్లో శ్రద్ధ వహించలేక పోవడం వలన పెద్దలతో మాటపడక తప్పదు. 
 
కన్య: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి చికాకులు తప్పవు. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. స్త్రీలకు బంధువుల తాకిడి వలన ఒత్తిడి, పనిభారం తప్పవు. చిన్న చిన్న విషయాలలో ఉద్రేక పడడం మంచిదికాదని గ్రహించండి. మిత్రుల రాకతో గృహంలో మార్పులు, చేర్పులకు అనుకూలమైన కాలం.  
 
తుల: ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, మధ్యవర్తుల పట్ల అప్రమత్తత అవసరం. సినిమా, కళా రంగాల్లో వారికి అభిమాన బృందాలు అధికం కాగలవు. మొండిబాకీలు వసూలవుతాయి.
 
వృశ్చికం: తలపెట్టిన పనుల్లో కొంతముందు వెనుకలుగానైనను సంతృప్తి కానరాగదలు. ఊహించని ఖర్చులు, బంధువులరాక వలన మానసికాందోళన తప్పదు. కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయల వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. కపటంలేని మీ ఆలోచనులు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. 
 
ధనస్సు: వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. కాంట్రాక్టర్లు ఒకే సమయంలో అనేక పనులు చేపట్టడం వలన విమర్శలు, త్రిప్పట అధికమవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. గృహోపకరణాలు కొనుగోలుచేస్తారు. ఆకస్మికంగా మీరు తీసుకున్న ఒక నిర్ణయం కుటుంబీకులను బాధించగలదు. 
 
మకరం: స్త్రీలు ఆడంబరాలకు పోయి సమస్యలు తెచ్చుకోకండి. చిట్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల్లో వారికి మెళకువ అవసరం. కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఇతరుల కారణంగా మీ పనులు, కార్యక్రమాలు వాయిదా పడడంతో నిరుత్సాహనం తప్పదు. నూతన పరిచయాలేర్పడుతాయి.    
 
కుంభం: స్త్రీలకు కళ్ళు, తల, నరాలు, నడుమునకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. కుటుంబ సమస్యలు, ఆర్థిక వ్యవహారాల పట్ల శ్రద్ధ వహిస్తారు. విద్యార్థినులలో ఏకాగ్రత లోపం వలన ఆందోళనకు గురవుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. నూతన పరిచయాలు, సంబంధ బాంధవ్యాలు మెరుగుపడుతాయి.   

మీనం: మిత్రుల సహాయ సహకారాలు అందించడం వలన కొన్ని సమస్యలకు పరిష్కారమార్గం కానరాగలదు. ఇతరులకు ధన సహాయం చేసి ఇబ్బందులకు గురవుతారు. ప్రముఖులను కలుసుకుంటారు. నిర్వహణ లోపం వలన వ్యాపార రంగంలోని వారికి సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. మెళకువ వహించండి. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments