09-12-2018 ఆదివారం దినఫలాలు - స్త్రీలకు ముఖ్యమైన విషయాల్లో..

Webdunia
ఆదివారం, 9 డిశెంబరు 2018 (09:09 IST)
మేషం: ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్య, రసాయన వ్యాపారస్తులకు లాభదాయకం. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడుతాయి. దూరప్రయాణాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. భాగస్వామ్యుల మధ్య పరస్పర అవగాహన లోపం, స్త్రీలకు ముఖ్యమైన విషయాల్లో గోప్యం అవసరమని గమనించండి. 
 
వృషభం: పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. మీ సంతానం కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబీకుల నుండి ఊహించన సమస్యలు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి. బంధువుల రాకపోకలు అధికమవుతాయి.  
 
మిధునం: రావలసిన ధనం చేతికందడంతో పొదువు దిశగా మీ ఆలోచలునలుంటాయి. అర్ధాంతరంగా నిలిపి వేసిన పనులు పునఃప్రారంభిస్తారు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహోపకరణాలు, వాహనం సమకూర్చుకుంటారు. పాత మిత్రుల కలయికతో మీలో కొంత మార్పు వస్తుంది.  
 
కర్కాటకం: బంధువుల వలన సమస్యలు, చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. ఖర్చులు అదుపుకోకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. ముఖ్యులకు శుభాకాంక్షలు అందజేస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించినప్పటికి వాటిని సద్వినియోగం చేసుకోలేరు.   
 
సింహం: ఆర్ధిక సమస్యలు తలెత్తిన మిత్రుల సహకారంతో తొలగిపోతాయి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలలో పాల్గొంటారు. స్థిరచరాస్తుల క్రయవిక్రయాలకు సంబంధించి కొన్ని అడ్డంకులు ఎదుర్కుంటారు. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసివస్తుంది. వ్యాపారాలు, పరిశ్రమలకు కావలసిన అనుమతులు మంజూరు కాగలవు.  
 
కన్య: ఆదాయ వ్యయాల విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఏదైనా స్థిరాస్తిని అమర్చుకోవాలనే ఆలోచన స్పురిస్తుంది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. చిన్న చిన్న సమస్యలు లెదురైనా పరిష్కరించుకుంటారు. ఇతరులకు అతి చనువు ఇవ్వడం మంచిది కాదని గమనించండి.  
 
తుల: విందు, వినోదాలలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి. విదేశీయాన యత్నాల్లో ఆటంకాలు తప్పవు. చేతి వృత్తులు, చిన్న తరహా పరిశ్రమల వారికి సామాన్యం. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. స్త్రీలకు బరువు, బాధ్యతలు అధికమవుతాయి. మత్స్య, కోళ్ల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది.   
 
వృశ్చికం: ప్రయాణాలలో ద్విచక్ర వాహనంపై ప్రయాణాలు శ్రేయస్కరం. ఖర్చులు, ధనసహాయానికి సంబంధించిన విషయాల్లో ఏకాగ్రత వహించండి. ఆత్మీయులకు విలువైన కానుకలు అందిస్తారు. దైవ, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రత్యర్దులు మిత్రులుగా మారి సహాయాన్ని అందిస్తారు. 
 
ధనస్సు: ఆర్ధికస్థితి ఒకింత మెరుగుపడడంతో ఊరట చెందుతారు. స్త్రీలు గృహాలంకరణ పట్ల ఆసక్తి కనపరుస్తారు. బంధుమిత్రుల నుండి, మెుహమ్మాటాలు ఎదురవుతాయి. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు మార్చుకోవలసి వస్తుంది. నిరుద్యోగులకు శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఖర్చులు అధికమవుతాయి.  
 
మకరం: ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది. ప్రముఖుల నుండి ఆహ్వానాలు మీకెంతో సంతృప్తి నివ్వగలవు. పాత్రికేయులకు ఒత్తిడి, పనిభారం అధికం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పనివారితో ఇబ్బందులు తప్పవు. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. ఆత్మీయులకు విలువైన కానుకలందిస్తారు.     
 
కుంభం: ఉద్యోగస్తులు విలువైన కానుకలు అందించి అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. చేపట్టిన పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. హామీలకు, మధఅవర్తిత్వాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం.    
 
మీనం: వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు సదవకాశాలు లభిస్తాయి. మీ కళత్ర మెుండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. అప్రయత్నంగా కొన్ని పనులు అనుకూలిస్తాయి. స్త్రీలు విలువైన వస్తువులను అమర్చుకుంటారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Final Supermoon of 2025: 2025లో చివరి పౌర్ణమి డిసెంబర్ 4.. సూపర్ మూన్ ఇదే లాస్ట్

తెలంగాణ రాజ్‌భవన్ పేరు మారిపోయింది...

ఫనీంద్ర రాసలీలలు.. మహిళతో యవ్వారం.. వీడియో తీసి వాట్సాప్ గ్రూపులో షేర్ చేసి..?

కేరళ పంచాయతీ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ

రాజ్ భవన్‌ను లోక్ భవన్‌గా పేరు మార్చాలి.. తెలంగాణ గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

లేటెస్ట్

01-12-2025 నుంచి 31-12-2025 వరకు మీ మాస ఫలితాలు

30-11-2025 ఆదివారం ఫలితాలు : మొండిబాకీలు వసూలవుతాయి

Weekly Horoscope: 30-11-2025 నుంచి 06-12-2025 వరకు మీ వార ఫలితాలు

శబరిమల ఆలయం నుండి బంగారం మాయం.. మాజీ తిరువాభరణం కమిషనర్‌ వద్ద విచారణ

29-11-2025 శనివారం ఫలితాలు - తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు...

తర్వాతి కథనం
Show comments