Webdunia - Bharat's app for daily news and videos

Install App

22-02-2018 గురువారం మీ రాశి ఫలితాలు.. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వకండి..

మేషం: ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. నిర్మాణ పనుల్లో చికాకులు తప్పవు. ముఖ్యులలో వచ్చిన మార్పు మీకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. విద్యార్థినుల్లో మానసిక ప్రశాంతత చోటుచేసుకుంటుంది. పాతమిత్రుల కల

Webdunia
గురువారం, 22 ఫిబ్రవరి 2018 (06:52 IST)
మేషం: ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. నిర్మాణ పనుల్లో చికాకులు తప్పవు. ముఖ్యులలో వచ్చిన మార్పు మీకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. విద్యార్థినుల్లో మానసిక ప్రశాంతత చోటుచేసుకుంటుంది. పాతమిత్రుల కలయికతో మీలో కొంత మార్పు వస్తుంది. ఇంటా బయటా అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. 
 
వృషభం: టెక్నికల్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పదు. నిర్మాణ కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పదు. నిర్మాణ కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. స్థిరాస్తుల కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. 
 
మిథునం: ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు దూరమవుతున్నారనే భావం నిరుత్సాహం కలిగిస్తుంది. ఇతర ఆలోచనలు విరమించుకుని ప్రస్తుత వ్యాపారాలపైనే దృష్టి సారించండి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఓర్పుతో పరిస్థితులను భరించండి. 
 
కర్కాటకం: ఉద్యోగస్తుల హోదా పెరిగే సూచనలున్నాయి. ఏదైనా స్థిరాస్తిని అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి రాగలవు. మీ సంతానం ఆరోగ్య విషయాలపై శ్రద్ధ, ఏకాగ్రత చాలా అవసరం. 
 
సింహం: ఆర్థిక విషయాల్లో చురుకుదనం కానవస్తుంది. గృహంలో వస్తువు పోవడానికి అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. మీ శ్రీమతి ఆరోగ్యంలో ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. కొబ్బరి పండ్ల పానీయ వ్యాపారులకు శుభదాయకం.
 
కన్య: కుటుంబ వాతావరణం ఉల్లాసాన్నిస్తుంది. వృత్తి ఉద్యోగాల యందు ఉన్నత స్థితిలో వుంటారు. స్థిరమైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఆస్తి తగాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. ప్రయాణాలు వాయిదాపడతాయి.
 
తుల : ధన, విద్య, ఆరోగ్య విషయాలు ఆనందదాయకంగా ఉంటాయి. ముఖ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి, గృహోపకరణాలు విలువైన వస్తువులు అమర్చుకుంటారు. రుణ యత్నాల్లో అనుకూలతలుంటాయి. దైవ కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు.
 
వృశ్చికం : వస్త్ర, వెండి, బంగారు లోహ వ్యాపారస్తులకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులు అందరితో సఖ్యతగా మెలుగుతూ తమ పనులను సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబీకుల ఆరోగ్యం విషయంలో ఏకాగ్రత వహించండి. ఉత్తర ప్రత్యుత్తరాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. 
 
ధనస్సు: నిత్యావసర వస్టు స్టాకిస్టులకు కొత్త సమస్యలు తలెత్తే ఆస్కారం వుంది. జాగ్రత్త వహించండి. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. వాహన చోదకులకు జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులు ఎలాంటి ఉద్రేకాలకు లోనుకాకుండా ఏకాగ్రతతో వ్యవహరించడం అన్ని విధాలా క్షేమదాయకం. స్త్రీల అభిప్రాయాలకు స్పందన అంతంత మాత్రంగా ఉంటుంది. 
 
మకరం: ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ప్రేమికులకు మధ్య ఎడబాటు తప్పదు. క్రయ విక్రయ రంగాల్లో వారికి లాభదాయకం. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. పొదుపు ఆవశ్యకతను బాగుగా గుర్తిస్తారు. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిది కాదు.
 
కుంభం: స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. దూర ప్రయాణాల్లో మెళకువ వహించండి. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. బ్యాంకింగ్, వ్యవహారాల్లో అపరిచితవ్యక్తుల పట్ల మెళకువ అవసరం. విదేశీ యత్నాలు వాయిదాపడతాయి. ఏజెన్సీ, లీజు, నూతన టెండర్లు నిరుత్సాహపరుస్తాయి.
 
మీనం: కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు వంటివి తలెత్తుతాయి. విద్యార్థినులలో మానసికధైర్యం, సంతృప్తి చోటుచేసుకుంటాయి. స్త్రీల కోరికలు నెరవేరడంతో గృహంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pune: బస్సులో వేధిస్తావా? పీటీ టీచర్ మజాకా.. 25సార్లు చెంప ఛెల్లుమనిపించింది.. (video)

ఫార్ములా ఈ రేస్‌ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు

వైసీపీకి వర్మకు ఉన్న సంబంధం అదే.. జీవీ రెడ్డి ఏమన్నారు..?

Srinivas Goud: తిరుమల కొండపై టీటీడీ వివక్ష చూపుతోంది.. ఇది సరికాదు.. శ్రీనివాస్ గౌడ్ (video)

Sujana Chowdary: సుజనా చౌదరి సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారుగా... విమర్శకులకు చెక్

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇళయరాజాకు ఆలయంలో అవమానం.. వీడియో వైర‌ల్

Daily Astro 16-12-2024 సోమవారం దినఫలితాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

Today Daily Astro 15-12-2024 ఆదివారం దినఫలితాలు : సంకల్పం సిద్ధిస్తుంది...

Weekly Horoscope : 15-12-2024 నుంచి 21-12-2024 వరకు మీ రాశిఫలాలు

Today Daily Astro 14-12-2024 శనివారం దినఫలితాలు

తర్వాతి కథనం
Show comments