Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ రోజు (మంగళవారం) ఫలితాలు.. మీ కదలికలపై నిఘా... తస్మాత్ జాగ్రత్త

మేషం : ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ సంతానం మొడివైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. మీ బాధ్యతలను ఇతరులకు అప్పగించడం మంచిదికాదు

Advertiesment
ఈ రోజు (మంగళవారం) ఫలితాలు.. మీ కదలికలపై నిఘా... తస్మాత్ జాగ్రత్త
, మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (08:45 IST)
మేషం : ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ సంతానం మొడివైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. మీ బాధ్యతలను ఇతరులకు అప్పగించడం మంచిదికాదు. మంచి మాటలతో ఎదుటివారిని ప్రసన్నం చేసుకోవడానికి యత్నించండి. 
 
వృషభం : ప్రైవేటు చిట్‌ఫండ్‌దారులు చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. నూతన పెట్టుబడులు పెట్టే విషయంలో పునరాలోచన మంచిది. రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. మీ కదలికలపై నిఘా ఉందన్న విషయం గమనించండి. 
 
మిథునం : కష్టసమయంలో ఆత్మీయులు తోడుగా నిలుస్తారు. మీ సంతానం కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. సలహా ఇచ్చేవారే కానీ సహకరించేవారు ఉండరు. టీవీ కార్యక్రమాలలో స్త్రీలు బాగా రాణిస్తారు. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. 
 
కర్కాటకం : పుణ్యక్షేత్రాల సందర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఒక విషయంలో సోదరులతో విభేదాలు తలెత్తవచ్చు. జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. ఇతరులకు వాహనం ఇచ్చే విషంలో లౌక్యంగా వ్యవహరించండి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. 
 
సింహం : నిరుద్యోగులు నిరుత్సాహం విడనాడి శ్రమించిన సత్ఫలితాలు పొందుతారు. అధికారులతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకోండి. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. 
 
కన్య : కొత్త ఆదాయ మార్గాల అన్వేషణ ఫలిస్తుంది. రవాణా రంగాల వారికి సమస్యలు తలెత్తుతాయి. రహస్యాన్ని దాచలేని మీ వైఖరి ఇబ్బందులకు దారితీస్తుంది. విద్యార్థులు బజారు తినుబండరాలు భుజించడం వల్ల అస్వస్థతకు లోనవుతారు. స్త్రీల ఆరోగ్యం మెరుగు పడటంతో పాటు శారీరక పటుత్వం నెలకొంటుంది. 
 
తుల : స్త్రీలకు తల, మెడ, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. శత్రువులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులకు చదువుల పట్ల ఏకాగ్రత అవసరం. కళలు, రాజకీయ నాయకులు మంచి గురితంపు, రాణింపు లభిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం. 
 
వృశ్చికం : కొన్ని అనుకోని సంఘటనలు దిగ్భ్రాంతికి గురిచేస్తాయి. కుటుంబ విషయాల్లో స్థిమితంగా ఉండకపోతే మానసిక అశాంతికి లోనవుతారు. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరుకావలసి ఉంటుంది. ఎంతటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. 
 
ధనస్సు : ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. మీ పనితీరు విధేయతలు అధికారులను ఆకట్టుకుంటారు. ఆలస్యంగానైనా పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. విద్యార్థులలో ఏకాగ్రత, మనోధైర్యం నెలకొంటాయి. 
 
మకరం : ఎల్.ఐ.సి ఏజెంట్లు, రిప్రజెంటేటివ్‌ల టార్గెట్ పూర్తవుతుంది. చిన్నచిన్న విషయాలను అంతగా పట్టించుకోవద్దు. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. మీ వాగ్ధాటితో అందరినీ ఆకట్టుకుంటారు. ధనం కంటే ఆత్మగౌరవానికే ప్రాధాన్యత ఇస్తారు. మీ ఆలోచనలను గోప్యంగా ఉంచి గుట్టుగా యత్నాలు సాగించాలి. 
 
కుంభం : మీ శ్రీమతి ఆకస్మిక ప్రయాణం నిరుత్సాహం కలిగిస్తుంది. వ్యాపార రహస్యాలు, ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మీ యత్నాల్లో నిర్లక్ష్యం, పనులు వాయిదా కూడదు. విదేశాల్లోని ఆత్మీయుల రాక సంతోషం కలిగిస్తుంది. 
 
మీనం : స్త్రీలకు వాహనం నడుపుతున్నపుడు, షాపింగ్‌లోనూ అప్రమత్తత అవసరం. ఉద్యోగస్తుల దైనందిన కార్యకలాపాలు ప్రశాంతంగా సాగుతాయి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత మెళకువ అవసరం చిన్న తప్పిదాలే సమస్యగా మారే ఆస్కారం ఉంది. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. వ్యాపారాల్ల కొత్త పథకాలు మెదలవుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగారాన్ని ఆకర్షించే స్వర్ణముఖి శిల...