Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనవరి 10, 2018 మీ రాశి ఫలితాలు ఇలా వున్నాయి

మేషం : దైవ, సేవ, పుణ్యకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. గతం కంటే పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. ప్రతి వ్యవహారం స్వయంగా చూసుకోవడం మంచిది. రుణ, విదేశీ యత్నాల్లో ఊహించని ఆటంకాలు ఎదుర్కొంటారు. ధన సహాయ

Webdunia
బుధవారం, 10 జనవరి 2018 (10:26 IST)
మేషం :  దైవ, సేవ, పుణ్యకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. గతం కంటే పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. ప్రతి వ్యవహారం స్వయంగా చూసుకోవడం మంచిది. రుణ, విదేశీ యత్నాల్లో ఊహించని ఆటంకాలు ఎదుర్కొంటారు. ధన సహాయం, హామీలకు సంబంధించిన విషయాల్లో పునరాలోచన అవసరం.
 
వృషభం : ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. స్త్రీలకు పనివారలతో చికాకులు, ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులకు గురవుతారు. మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. మిత్రులను కలుసుకుంటారు.
 
మిథునం : ఆర్థిక వ్యవహారాలు, వ్యాపారాల్లో మంచి మంచి ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. భార్యాభర్తల మధ్య అవగాహన లోపం. విజయాలు తేలికగా సొంతమవుతాయి. ఊహించని ఓ వార్త మీ ఆర్థిక అస్థిరతను పోగొడుతుంది. స్త్రీలు నరాలు, ఉదరానికి సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు.
 
కర్కాటకం : ఆర్థిక వ్యవహారాలు, వ్యాపారాల్లో మంచి మంచి ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. భార్యాభర్తల మధ్య అవగాహన లోపం. విజయాలు తేలికగా సొంతమవుతాయి. ఊహించని ఓ వార్త మీ ఆర్థిక అస్థిరతను పోగొడుతుంది. స్త్రీలు నరాలు, ఉదరానికి సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు.
 
సింహం : స్థిరాస్తి క్రయ విక్రయాల్లో పునరాలోచన అవసరం. పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి ఒత్తిడి, పనిభారం అధికం. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. పెద్దల ఆరోగ్యం, ప్రయాణాల్లో వస్తువుల పట్ల మెళకువ అవసరం. ప్రముఖులను కలుసుకుంటారు.
 
కన్య : వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. కాంట్రాక్టర్లు, క్యాటరింగ్ పనివారలకు పనిభారం అధికమవుతుంది. మీ శ్రీమతి ప్రోత్సాహంతో ఒక శుభకార్యానికి యత్నాలు మొదలెడతారు. బంధువులు, ఆత్మీయుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. ఖర్చులు అధికమవుతాయి.
 
తుల : వృత్తుల వారు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరు కావలసి ఉంటుంది. మీ అవసరాలకు కావలసిన ధనం అతికష్టంమ్మీద సర్దుబాటు అవుతుంది. చిన్న సమస్య కదా అని తేలికగా తీసుకోవడం మంచిది కాదు.
 
వృశ్చికం : బంధువులు, ఆత్మీయుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. మీ సంతానం మొండి వైఖరి చికాకు పరుస్తుంది. స్త్రీలలో నూతనోత్సాహం, పలు ఆలోచనలు చోటు చేసుకుంటాయి. రాజకీయనాయకులు సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.
 
ధనస్సు : మీ ఆంతరంగిక విషయాలు, వ్యాపార లావాదేవీలు గోప్యంగా ఉంచండి. భాగస్వామిక సమావేశాలు అర్థాంతంగా ముగించవలసి వస్తుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులకు అనుకూలం. మీ మాటకు ఇంటా బయటా ఆదరణ లభిస్తుంది. మీ సంతానం కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు.
 
మకరం : స్త్రీలు చేపట్టిన పనుల్లో చికాకులు, అవాంతరాలు ఎదుర్కొంటారు. ఉమ్మడి వ్యవహారాలు ఆర్థిక లావాదేవీల్లో ఏకాగ్రత ముఖ్యం. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం మంచిది కాదని గమనించండి. విద్యార్థినులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత. కొత్త విషయాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. రుణాలు తీరుస్తారు.
 
కుంభం : సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. స్త్రీలకు విలువైన వస్తువుల కొనుగోళ్ళలో ఏకాగ్రత వహించండి. మీ అవసరాలకు కావలసిన ధనం అతికష్టంమ్మీద సర్దుబాటు అవుతుంది. ఉద్యోగస్తులు విశ్రాంతి పొందుతారు. ఆత్మీయులకు మీ సమస్యలు చెప్పుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
 
మీనం : నిరుద్యోగులు ఒక పత్రికా ప్రకటన వల్ల ఆకర్షితులవుతారు. అనుకోకుండా స్త్రీలకు దంతాలు, ఎముకలకు సంబంధించిన వ్యాధులు తలెత్తుతాయి. మీ సమర్థతను కుటుంబీకులు, సన్నిహితులు గుర్తిస్తారు. వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ప్రయాణాలు అనుకూలం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిత్తూరు జిల్లాలో హెచ్‌సిసిబి సీఎస్ఆర్ కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్

Amaravati: ఆగస్టు 15న ప్రారంభం కానున్న అమరావతి సీఆర్డీఏ కార్యాలయం

గచ్చిబౌలిలో తాటిచెట్టుపై పడిన పిడుగు, పిడుగులు పడుతున్నప్పుడు ఏం చేయాలి? ( video)

AP: ఒడిశా నుంచి కేరళకు బొలెరోలో గంజాయి.. పట్టుకున్న ఏపీ పోలీసులు

ప్రజ్వల్ రేవన్నకు చనిపోయేంత వరకు జైలు - నెలకు 2 సార్లు మటన్ - చికెన్

అన్నీ చూడండి

లేటెస్ట్

03-08-2025 ఆదివారం ఫలితాలు - పందాలు, బెట్టింగుకు పాల్పడవద్దు...

03-08-2025 నుంచి 09-08-2025 వరకు మీ వార రాశి ఫలితాల

02-08-2025 శనివారం ఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు....

Pindi Deepam: శ్రావణ శనివారం శ్రీవారిని పూజిస్తే.. పిండి దీపం వెలిగిస్తే?

భయాన్ని పోగొట్టే భగవంతుని శ్లోకాలు

తర్వాతి కథనం
Show comments