కాలభైరవాష్టమి.. నువ్వులు, మిరియాలు, నెయ్యి దీపం వెలిగిస్తే..

Webdunia
శుక్రవారం, 30 డిశెంబరు 2022 (16:28 IST)
కాలభైరవాష్టమిని అన్ని శివాలయాలలో ఎంతో వైభవంగా జరుపుకుంటారు. కాలభైరవుడు జన్మించిన భైరవ అష్టమి రోజున ప్రత్యేక పూజలలో పాల్గొనడం ద్వారా అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం. భైరవ అష్టమి రోజున ఆయనను ఆరాధించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అలాగే అష్టమి రోజున స్వర్ణకమల రేఖ కొలువైన స్వర్ణకర్షణ భైరవమూర్తిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది. శ్రీ భాగవత్పాద ఆదిశంకరుడు సృష్టించిన ఈ భైరవ ఆరాధన వ్యాధులను నయం చేస్తుంది. 
 
కాలదేవుడైన కాలభైరవుడికి తలరాతను మార్చే గుణం ఉంది. అందువల్ల, అప్పుల బాధలో వున్నవారు.. భైరవ అష్టమి రోజున భైరవుడికి బిల్వార్చన చేయాలి. అష్టమి రోజున కాలభైరవునికి నువ్వుల నూనె దీపాలు వెలిగించడం, విభూతితో అభిషేకం చేయడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. మూడు కళ్లతో ఒక కొబ్బరి మూతలో పంచ నూనెలు పోసి వెలిగించడం కూడా ప్రత్యేకం. నెయ్యి దీపం, మిరియాల దీపం కొన్ని దేవాలయాలలో ప్రత్యేకంగా వెలిగిస్తారు. 
 
ఇంకా ఆలయాల్లో జరిగే భైరవ లక్షార్చన, శ్రీరుద్ర యజ్ఞం, శ్రీభైరవ హోమం మొదలైన వాటిలో పాల్గొనడం చాలా ప్రత్యేకం. ఎనిమిది రకాల పుష్పాలతో పూజించాలి.  
"ఓం కాలా కాలా విద్మహే
 కాలా తిథాయ ధీమహీ,
తన్నో కాలా భైరవ ప్రచోదయాత్".
 
ఈ గాయత్రి మంత్రాన్ని 108 సార్లు పఠించి పూజించినట్లయితే, నయం కాని అన్ని వ్యాధులు నయమవుతాయి. కాబట్టి కాలభైరవ అష్టమి రోజున, సమీపంలోని శివాలయానికి వెళ్లి భైరవుడిని ఆరాధించాలి. తద్వారా శత్రు సమస్యలు వుండవు. దీని ఫలితంగా, శత్రువుల బాధలు, పేదరికం తొలగిపోతుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌కు రిమాండ్ పొడగింపు

బాల రాముడి ఆలయ శిఖరంపై జెండాను ఎగురవేసిన ప్రధాని మోడీ

New Bride: ఇష్టం లేని పెళ్లి చేశారు.. నన్ను క్షమించండి.. మంగళసూత్రం పక్కనబెట్టి పరార్

తుఫానుగా మారనున్న అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

పాఠాశాల ఐదో అంతస్థు నుంచి దూకేసిన పదవ తరగతి బాలిక.. కారణం ఏంటి?

అన్నీ చూడండి

లేటెస్ట్

సమాధిలోని దీపపు కాంతిలో దేదీప్యమానంగా వీరబ్రహ్మేంద్రస్వామి

23-11-2025 నుంచి 29-11-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

22-11-2025 శనివారం ఫలితాలు - మీపై శకునాల ప్రభావం అధికం...

21-11-2025 శుక్రవారం ఫలితాలు - చీటికి మాటికి అసహనం చెందుతారు...

Love: ప్రేమిస్తే ఈ నెలల్లో పుట్టిన అమ్మాయిల్నే ప్రేమించాలి.. ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments