Publish Date: Wed, 28 Dec 2022 (23:25 IST)
Updated Date: Wed, 28 Dec 2022 (23:30 IST)
నేరేడు చెట్టు. ఈ చెట్టు ఆకులు, పండ్లు ఎన్నో అనారోగ్య సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తాయి. వాటిలో ముఖ్యమైన ప్రయోజనాలను తెలుసుకుందాము.
నేరేడు విత్తనాలు, పొడపత్రి కాచు, పసుపు, ఎండు ఉసిరిక కలిపి చూర్ణం చేసుకుని దాన్ని చెంచా చొప్పున రోజుకు మూడుసార్లు తీసుకుంటే మధుమేహం అదుపులో వుంటుంది.
నేరేడు ఆకు చూర్ణంతో పండ్లు తోమితే కదిలే దంతాలు గట్టిపడతాయి.
నేరేడు చెక్క కషాయాన్ని పుక్కిలిపడితే నోటిలోని పుండ్లు చాలా త్వరగా మానిపోతాయి.
నేరేడు ఆకు చిగుళ్లు, మామిడి ఆకు చిగుళ్లు తీసుకుని వాటితో కషాయం కాచి, దానిలో తేనె చేర్చి సేవిస్తే పైత్యపు వాంతులు వెంటనే తగ్గిపోతాయి.
కిడ్నీలో రాళ్లు వున్నవారు నేరేడు పండ్లు తింటే అవి కరిగిపోవడమే కాదు మరోసారి రాళ్లు ఏర్పడే అవకాశమే వుండదు.
ముఖ్యమైన గమనిక ఏమిటంటే నేరేడు పండ్లను ఎట్టి పరిస్థితుల్లో పరగడుపున తీసుకోకూడదు.
ఆపరేషన్ చేయించుకున్నవారు కూడా వైద్య సలహాలు తీసుకున్న తర్వాత నేరేడు పండ్లను తినాలి.