Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ashadha Amavasya: ఆషాఢ అమావాస్య- జూన్ 25 బుధవారం రోజున ఇలా చేస్తే.. కర్మలు మటాష్

సెల్వి
సోమవారం, 23 జూన్ 2025 (22:01 IST)
ఆషాఢ అమావాస్య జూన్ 25 బుధవారం నాడు జరుపుకుంటారు. ఈ రోజున పితృ తర్పణం, పిండ దానం, ఇతర పూర్వీకుల ఆచారాలను నిర్వహించడానికి శక్తివంతమైన రోజుగా భావిస్తారు. భారతదేశం అంతటా భక్తులు తమ పూర్వీకులకు అంకితమైన పూజలలో పాల్గొంటారు.
 
పితృదేవతల ఆత్మలకు శాంతి చేకూరేలా పిండప్రదానం చేస్తారు. ఈ అమావాస్య తిథి యోగా, ధ్యానం, దాతృత్వం వంటి ఆధ్యాత్మిక సాధనలకు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఆషాఢ అమావాస్య జూన్ 24 సాయంత్రం 06:59 గంటలకు ప్రారంభమవుతుంది జూన్ 25 సాయంత్రం 04:00 గంటలకు అమావాస్య ముగుస్తుంది.
 
సాధారణంగా అమావాస్య చంద్రుని శక్తి అత్యల్పంగా ఉన్న సమయాన్ని సూచిస్తుంది. ఈ రోజున, పూర్వీకుల ఆత్మలు వారి వారసులను సందర్శిస్తాయని విశ్వాసం. ఇంకా పితృదేవతలకు వారి వారసులు ప్రార్థనలు, ఆహారం అందించడం వలన మరణానంతరం వారికి శాంతి లభిస్తుందని విశ్వాసం. 
 
చాలామంది గంగా వంటి పవిత్ర నదులలో స్నానం చేస్తారు. ఆ ప్రాంతాల్లో పిండప్రదానం చేస్తారు. అమావాస్య అంటే మరణించిన వారి గురించి విచారించడం మాత్రమే కాదు, వారి వారసత్వాన్ని గౌరవించడం కూడా. ముఖ్యంగా ఆషాఢ అమావాస్య అనేది పూర్వీకుల కర్మ రుణాలను తొలగించుకోవడానికి ప్రతీతి. ఇంకా ఈ రోజు పితరుల ఆశీర్వాదాలను కోరుకోవడానికి, భవిష్యత్ తరాలకు శాంతి, శ్రేయస్సును నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది.
 
ఈ రోజున పుణ్యకార్యంగా పేదలకు ఆహారం, దుస్తులు, నిత్యావసరాలను దానం చేయడం మంచిది. ఇంకా ఆవులు, కాకులు, శునకాలు, చీమలు వంటి జంతువులకు ఆహారం ఇవ్వండి. బ్రాహ్మణులను లేదా పూజారులను ఇంటికి ఆహ్వానించండి. వారికి సాత్విక భోజనం వడ్డించండి. వారికి వస్త్రదానం చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఈ రోజున ప్రతికూల ఆలోచనలను నివారించడం, ఉపవాసం, జపం లేదా ధ్యానం వంటి ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెట్టడం మంచిదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

లేటెస్ట్

Saturday Saturn Remedies: శనివారం నల్లనువ్వులు, ఆవనూనెతో ఇలా చేస్తే.. రావిచెట్టులో శనిగ్రహం..?

29-08-2025 శుక్రవారం ఫలితాలు - ఆప్తుల చొరవతో సమస్య పరిష్కారం....

Sankata Nasana Ganesha Stotram: సంకట నాశన గణేశ స్తోత్రాన్ని రోజూ పఠిస్తే..?

28-08-2025 గురువారం రాశిఫలాలు - ఎదుటివారి అంతర్యం గ్రహించండి.. భేషజాలకు పోవద్దు...

వినాయక చవితి 2025: ఏకంగా ఐదు యోగాలు.. ఈ రాశుల వారికి అదృష్టం

తర్వాతి కథనం
Show comments