Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో ఇండియాలో ఎంజాయ్... ఆ తర్వాత విదేశాల్లో హ్యాపీ... అలాంటి ఎన్ఆర్ఐ భర్తలకు...

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (18:40 IST)
ఈమధ్య కాలంలో ఎన్ఆర్ఐ భర్తల మోసాలు ఎక్కువవుతుండటంతో అలాంటి సమస్యలను  పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త మార్గంలో చర్యలు తీసుకుంటోంది. భార్యలను వదిలేసి విదేశాలకు పారిపోయిన 45 మంది ఎన్ఆర్ఐ భర్తల పాస్‌పోర్ట్‌లను రద్దు చేసినట్లు కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ తెలియజేసారు.
 
పెళ్లి చేసుకుని వివిధ కారణాల వల్ల తమ భార్యలను తీసుకెళ్లకపోవడం లేదా వారిని వేధింపులకు గురి చేయడం వంటి సంఘటనలు ఎక్కువ అవుతుండటంతో అటువంటి భర్తల పాస్‌పోర్ట్‌లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేసే దిశగా విదేశాంగ శాఖ, మహిళా సంక్షేమ శాఖ, హోమ్ శాఖ, న్యాయ శాఖ సంయుక్తంగా ఒక బిల్లును ప్రవేశపెట్టాయి. ఈ బిల్లు ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందింది.
 
కాగా ఇలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు ఇంటిగ్రేటెడ్ నోడల్ ఏజెన్సీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సంస్థ భార్యలను మోసం చేసి వెళ్లిపోయిన భర్తలపై లుక్ అవుట్ నోటీసు జారీ చేసి, వారి పాస్‌పోర్ట్‌లను రద్దు చేస్తుందని మేనకాగాంధీ తెలిపారు. ఇప్పటి వరకు ఈ సంస్థ 45 మంది ఎన్ఆర్ఐ భర్తల పాస్‌పోర్ట్‌లను రద్దు చేసినట్లు ఆమె తెలియజేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

2025 సంవత్సరానికిగాను సెలవులు ప్రకటించిన తెలంగాణ సర్కారు

యువకుడిపై దాడి చేసిన పెద్దపులి... ఏవోబీలో కలకలం...

ఇకపై వచ్చే తుఫానులన్నీ తీవ్ర ప్రభావం చూపుతాయి...

జనాభాను పెంచేందుకు రష్యాలో శృంగారపు మంత్రి

కుటుంబ సభ్యుల జోక్యం వద్దనే వద్దు... పార్టీ నేతలకు డిప్యూటీ సీఎం పవన్ (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సరైన భాగస్వామిగా సరైన వ్యక్తిని ఎంచుకోకపోతే జీవితం నరకమే : వరుణ్ తేజ్

కోలీవుడ్‌లో విషాదం - ఢిల్లీ గణేశ్ ఇకలేరు...

సోనీ LIV ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్‌ ట్రైలర్‌ను ఆవిష్కరణ, నవంబర్ 15న ప్రసారం

హైదరాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత నడుమ సికిందర్ షూటింగ్

శంకర్ గారితో పని చేయడం అదృష్టం: రామ్ చరణ్

తర్వాతి కథనం
Show comments