Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎన్నారై... అమెరికాలో దొంగ కంపెనీల పేరిట మోసం...

ఎన్నారై... అమెరికాలో దొంగ కంపెనీల పేరిట మోసం...
, గురువారం, 7 మార్చి 2019 (16:27 IST)
కూర్చున్న కొమ్మని నరుక్కుంటే పడిపోతామనేది నీతి కథ... అది ఎలా మర్చిపోయారో కానీ ప్రబుద్ధులు అమెరికా వెళ్లి మరీ తాము ఉద్యోగం చేస్తున్న కంపెనీని మోసం చేయబోయి అరెస్ట్ చేయబడ్డారు.
 
వివరాలలోకి వెళ్తే... అమెరికాలో దొంగ కంపెనీలు ఏర్పాటు చేసి, తాను ఉద్యోగం చేస్తున్న సంస్థను మోసం చేసిన సిస్కో సిస్టమ్స్‌‌కి చెందిన మాజీ డైరెక్టర్‌ పృథ్వీరాజ్‌ భిఖాను ఇటీవల ఆ దేశ పోలీసులు అరెస్ట్‌ చేసి అదుపులోకి తీసుకున్నారు. 2017 మధ్య వరకూ ఆ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్న ఆయన మారుపేర్లతో కంపెనీలు ఏర్పాటు చేసి సిస్కోకు చెందిన కాంట్రాక్ట్‌లన్నీ వాటికే వెళ్లేలా చేసారని అభియోగాలు నమోదు చేయబడ్డాయి. 
 
ఈ మేరకు 93 లక్షల డాలర్ల నష్టం జరిగినట్లు గుర్తించిన కంపెనీ కేసు పెట్టింది. దీంతో పృథ్వీరాజ్‌ను శాన్‌ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో మార్చి ఒకటో తేదీని అరెస్ట్‌ చేసి ఫెడరల్‌ కోర్టులో హాజరుపర్చగా 30 లక్షల డాలర్ల బాండ్‌పై విడుదల చేశారు. ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 18న జరుగుతుందని అమెరికా అటార్నీ డేవిడ్‌ ఆండర్సన్‌, ఎఫ్‌బీ స్పెషల్‌ ఏజెంట్‌ ఇన్‌చార్జి జాన్‌ బెన్నట్‌ తెలిపారు. ఈ కేసులో నేరం రుజువైతే 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు 2.5 లక్షల డాలర్ల జరిమానా విధించబడే అవకాశం ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బానపొట్ట తగ్గిపోవాలంటే...