Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఓవియను అరెస్ట్ చేయాలి: మహిళా సంఘం(Video)

Advertiesment
ఓవియను అరెస్ట్ చేయాలి: మహిళా సంఘం(Video)
, మంగళవారం, 5 మార్చి 2019 (14:41 IST)
స్త్రీల స్వేచ్ఛను హరించడమే సమాజానికి చేటు అంటూ.. నటుడు శింబు పేర్కొన్నారు. ఎప్పుడూ వివాదాల్లో ఉండే శింబు 90 ఎంఎల్ చిత్రంతో మరోసారి వార్తల్లోకెక్కారు. నటి ఓవియా ప్రధాన పాత్రలో నటింటిన తాజా చిత్రం 90 ఎంఎల్. ఈ చిత్రానికి అనితా ఉదీప్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అభిమానుల దగ్గర మిశ్రమ స్పందన దక్కించుతుంది. 
 
అంతేకాదు, విమర్శకుల నుండి మాత్రం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. అందుకు ముఖ్యకారణం.. 90 ఎంఎల్‍‌లో అమ్మాయిలు మద్యం సేవించడం, పొగ తాగడం, సహజీవనం సాగించడం వంటి పలు అంశాలుండటమే. ఇదే శింబుని విమర్శల పాలు చేసింది. దీనికి స్పందించిన శింబు మొదటిసారిగా మహిళల ఇతివృత్తంతో కూడిన చిత్రాల్లో మగవారిని కించపరచకుండా స్త్రీల స్వేచ్ఛ గురించి అనితా ఉదీప్ ఈ కథను తయారుచేశారని అన్నారు. అలాంటిది.. మనమే భావితరాలను, సమాజాన్ని నాశనం చేసే చిత్రం అని గగ్గోలు పెడుతున్నామన్నారు.
 
స్త్రీ స్వేచ్ఛను అడ్డుకోవడమే సంప్రదాయాలకు చేటు.. నేను మహిళా వ్యతిరేకినని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారనీ.. అందుకే ఈ చిత్రానికి మద్దతు ఇచ్చి.. సంగీతాన్ని అందించానని శింబు చెప్పుకొచ్చారు. దీన్ని అర్థం చేసుకున్న మగవారికి ధన్యవాదాలు అని శింబు పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
కాగా.. 90 ఎంఎల్ సినిమాపైనా, దర్శకురాలు, హీరోయిన్ ఓవియలపై తీవ్రంగా మండిపడుతున్నారు. ముఖ్యంగా మహిళను కించపరిచే సన్నివేశాల్లో నటించినందుకు ఓవియను అరెస్ట్ చేయాలంటూ ఇండియా దేశీయ లీగ్ పార్టీ మహిళా విభాగ నిర్వాహకులు సోమవారం నాడు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అర్జున్ సురవరం చిత్రం టీజర్ విడుదలైంది...(Video)