Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెయింట్ లూయిస్‌లో ఘనంగా దీపావళి వేడుకలు

Webdunia
శనివారం, 2 నవంబరు 2019 (22:01 IST)
సెయింట్ లూయిస్: అమెరికాలో సెయింట్ లూయిస్‌లో దీపావళి వేడుకల ఘనంగా జరిగాయి. లిండ్బర్గ్ లోని షామినాడ్ కాలేజిలో సెయింట్ లూయిస్ తెలుగు అసోషియేషన్ నిర్వహించిన ఈ వేడుకల్లో కోటి మ్యూజికల్ నైట్ తెలుగువారిని ఆనంద ఢోలికల్లో ముంచెత్తింది. దాదాపు రెండు వేలమందికి పైగా తెలుగువారు ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఏఎస్ తెలుగు అసోషియేషన్ ఆఫ్ సెయింట్ లూయిస్ దీపావళి పురస్కారాలను ప్రకటించింది. తెలుగువారి మేలు కోసం అమెరికాలో అనేక విధాలుగా కృషి చేస్తున్న ప్రముఖులకు ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. 
 
నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడిని దీపావళి పురస్కారంతో సత్కరించడం జరిగింది. నాట్స్ అధ్యక్షుడిగా అమెరికాలో పలు సేవాకార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నందుకు శ్రీనివాస్ మంచికలపూడిని ఈ పురస్కారం వరించింది. నాట్స్ మెడికల్ క్యాంపుల ద్వారా స్థానిక తెలుగువారికి ఉచిత వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ సుధీర్ అట్లూరి, డాక్టర్ రమా అట్లూరిని కూడా టీఏఎస్ దీపావళి పురస్కారాలతో సత్కరించింది.
 
వీరితో పాటు స్థానిక టెంపుల్ ట్రస్ట్రీ మాజీ ఛైర్మన్ జీవీ నాయుడు, రాజ్యలక్ష్మి, ప్రస్తుత టెంపుల్ బోర్డ్ ఛైర్మన్ రజనీ కాంత్ గంగవరపు, పీజీఎన్ ఎఫ్ పౌండర్స్ శ్రీనివాస్ గుల్లపల్లి, చిన్నా ముచ్చెర్ల, కూచిపూడి ఛారిటబుల్  ట్రస్ట్  సుజాత ఇంజమూరి తదితరులకు దీపావళి పురస్కారాలు వరించాయి. టెంపుల్ డోనర్, కమ్యూనిటీ సర్వీస్ అవార్డును శ్రీథర్ కొత్తమాసుకు అందించడం జరిగింది. 
 
ఈ పురస్కారాలన్నీ టీఎస్ ప్రెసిడెంట్ సురేంద్ర బాచిన, వైస్ ప్రెసిడెంట్ వెంకట్ గౌని, సెక్రటరీ రమేశ్ కొండముట్టి, కల్చరల్ సెక్రటరీ అర్చన ఉపమాక, ట్రెజరర్ రంగ సురేశ్, బోర్డ్ ఆఫ్ ఛైర్మన్ కుమార్ రెడ్డి, డైరెక్టర్లు శ్రీనివాస భూమా, జగన్ వేజండ్ల, జితేంద్ర ఆలూరి, రాకేశ్ గజగౌని చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో కీలక పాత్ర పోషించిన వాలంటీర్లకు, ఈ వేడుకలకు స్పాన్సర్‌గా వ్యవహారించిన వారికి సెయింట్ లూయిస్ తెలుగు అసోషియేషన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Elon Musk: ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీ- రష్యా బంపర్ ఆఫర్.. ఏంటది?

Travel Bag: 2 నెలల గర్భవతిని హత్య చేశాడు.. ట్రావెల్‌ బ్యాగ్‌లో కుక్కి పారేశాడు..

Man Mums, ఒక్కసారి వాటేసుకుంటే రూ. 600 చెల్లిస్తున్న యువతులు, ఎందుకిలా?

AP ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

Drunk man: తాగిన మత్తులో పక్కింటి మహిళను భార్యగా భావించి ఏం చేశాడంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

తర్వాతి కథనం
Show comments