03-11-2019 నుంచి 09-11-2019 వరకూ మీ వార రాశి ఫలితాలు

శనివారం, 2 నవంబరు 2019 (17:05 IST)
మేషం : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఆచితూచి వ్యవహరించాలి. ప్రతికూలతలెదురవుతాయి. మీ అభిప్రాయాలకు స్పందన ఉండదు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. పట్టుదలతో యత్నాలు సాగించండి. రుణ ఒత్తిళ్లు అధికం. ఖర్చులు అదుపులో ఉండవు. సన్నిహితుల హితవు మీపై ప్రభావం చూపుతుంది. దంపతుల మధ్య సఖ్యత లోపం. ఆధిక్యత ప్రదర్శించవద్దు. మంగళ, బుధవారాల్లో శ్రమ, పనుల్లో ఒత్తిడి అధికం. ఒక ఆహ్వానం ఆలోచింపజేస్తుంది. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వృత్తుల వారికి ఆశాజనకం. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. అధికారుల హోదా మార్పు. ఆధ్యాత్మిక పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వనసమారాధనలు ఉల్లాసం కలిగిస్తాయి.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. 
ఖర్చులు విపరీతం, పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. పెట్టుబడులు అనుకూలించవు. నగదు, పత్రాలు జాగ్రత్త. ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. గుట్టుగా యత్నాలు సాగించండి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. తొందరపడి హామీలివ్వవద్దు. గురు, శుక్రవారాల్లో పనులు సాగవు. పెద్దల ఆరోగ్యం కుదుపటపడుతుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఓర్పు ప్రధానం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. ప్రయాణం తలపెడతారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. 
వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. ఎవరినీ తక్కువగా అంచనా వేయొద్దు. గుట్టుగా యత్నాలు సాగించండి. బంధువులు మీ ఆలోచనలు నీరుగార్చేందుకు యత్నిస్తారు. ఆదాయం సంతృప్తికరం. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు క్షేమం మంచిదికాదు. నిలిచిపోయిన పనులు పూర్తిచేస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. శనివారంనాడు కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. కార్యక్రమాల్లో మార్పులుంటాయి. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి. పరిచయంలేని వారితో జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. చిరు వ్యాపారులకు సామాన్యం. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉద్యోగస్తులకు పనిభారం. విశ్రాంతి లోపం. వన సమారాధనల్లో పాల్గొంటారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం. పుష్యమి, ఆశ్లేష 
పెట్టుబడులపై దృష్టిపెడతారు. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. ఆప్తులకు సాయం అందిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఉల్లాసంగా గడుపుతారు. మీ జోక్యం అనివార్యం. పనులు సావకాశంగా పూర్తిచేస్తారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఆది, సోమవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఒక సంఘటన ఆందోళన కలిగిస్తుంది. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. ప్రశంసలు అందుకుంటారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం.
శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఉన్నతి కొంతమందికి అపోహ కలిగిస్తుంది. వాగ్ధాటితో నెట్టుకొస్తారు. వ్యవహారానుకూలత ఉంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. వివాదాలు సద్దుమణుగుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. బాధ్యతగా వ్యవహరించాలి. పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఖర్చులు అంచనాలను మించుతాయి. మంగళ, గురువారాల్లో అప్రమత్తంగా ఉండాలి. నగదు, స్వీకరణ చెల్లింపుల్లో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నం సాగించండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. నిర్మాణాలు ఊపందుకుంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. 
వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయ. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. విపరీతమైన ఖర్చులు. రుణ ఒత్తిళ్లు. అప్రమత్తంగా ఉండాలి. మనస్సు స్థిమితం ఉండదు. ఆప్తుల కలయికతో కుదుటపడుతారు. అవకాశాలు చేజారిపోతాయి. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. బుధవారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. సంప్రదింపులకు అనుకూలం. తొందరపాటు నిర్ణయాలు తగవు. పెద్దల సలహా పాటించండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. వృత్తులవారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం తగదు. కోర్టు వాయిదాలు చికాకుపరుస్తాయి.
 
తుల : చిత్త, 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. 
సంప్రదింపులు ఒక కొలిక్కివస్తాయి. చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. శుక్ర, శనివారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. ఆధ్యాత్మిక పెంపొందుతుంది. దీక్షలు స్వీకరిస్తారు. పరిచయాలు బలపడతాయి. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
వ్యవహారానుకూలత అంతంత మాత్రమే. ఆలోచనలు చికాకు పరుస్తాయి. గత తప్పిదాలు పునరావృతమవుతాయి. నిరుత్సాహానికి గురవుతారు. సన్నిహితులను కలుసుకుంటారు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. రాబడిపై దృష్టిపెడతారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. ఆది, సోమవారాల్లో పనులు సాగవు. ఆహ్వానం అందుకుంటారు. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. కొత్త విషయాలు తెలుసుకుంటారు. విలువైన వస్తువులు మరమ్మతులకు గురవుతాయి. వేడుకలకు హాజరవుతారు. అత్యుత్సాహం ప్రదర్శించవద్దు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. షాపు పనివారలతో జాగ్రత్త. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం.
 
ధనస్సు : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం.
ఈ వారం ఆశాజనకం. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ధనలాభం ఉంది. ఖర్చులు అధికం. సంతృప్తికరం. పనులు మొండిగా పూర్తిచేస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలెదురవుతాయి. కొత్త సమస్యలెదురవుతాయి. ఆత్మీయుల సలహా పాటించండి. అనవసర జోక్యం తగదు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు మున్ముందు సత్ఫలితాలిస్తాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు బలపడతాయి. వేడుకల్లో పాల్గొంటారు. వాహనం ఇతరులకివ్వవద్దు. ప్రయాణం కలిసివస్తుంది.
 
మకరం : ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. 
స్వయంకృషితో రాణిస్తారు. సమర్థతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. అవకాశాలను వదులుకోవద్దు. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు అధికం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు వేగవంతమవుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఊహించని సంఘటనలెదురవుతాయి. సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలెదురవుతాయి. ఆధిక్యత ప్రదర్శించవద్దు. పోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. బంధువులు మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాల్లో స్వల్ప ఒడిదుడుకులెదుర్కొంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ముఖ్యం. అధికారుల వైఖరి బాధిస్తుంది. వనసమారాధనల్లో పాల్గొంటారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. 
ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. మంగళ, బుధవారాల్లో బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఒక సమస్య సద్దుమణిగుతుంది. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుంటాయి. పెట్టుబడులకు అనుకూలం కాదు. చెల్లింపుల్లో మెలకువ వహించండి. పత్రాలు, వస్తువులు జాగ్రత్త. పనులు హడావుడిగా సాగుతాయి. ఆహ్వానం అందుకుంటారు. పరిచయాలు బలపడతాయి. సంతానం భవిష్యత్తుపై మరింత శ్రద్ధ అవసరం. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. సరకు నిల్వలో జాగ్రత్త. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు పనిభారం. విశ్రాంతి లోపం. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు.
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
బంధువులతో విభేదిస్తారు. అకారణంగా మాటపడవలసి వస్తుంది. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. గురు, శుక్రవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆలోచనలతో మనస్థిమితం ఉండదు. ఖర్చులు సామాన్యం. ధనానికి ఇబ్బంది ఉండదు. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఆప్తులను కలుసుకుంటారు. వ్యాపకాలు అధికమవుతాయి. గుట్టుగా యత్నాలు సాగించండి. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. ఇంటి విషయాల పట్ల శ్రద్ధ వహించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత లోపం. చీటికిమాటికి అసహనం చెందుతారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు నిరుత్సాహపరుస్తాయి.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం తెలుగు పంచాంగం.. శనివారం 02-11-2019