Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

02-11-2019 శనివారం మీ రాశి ఫలితాలు (Video)

Advertiesment
Daily Horoscope
, శనివారం, 2 నవంబరు 2019 (06:00 IST)
శ్రీమన్నారాయణుడిని తులసీదళాలతో పూజించినా శుభం, జయం చేకూరుతుంది. 
 
మేషం: కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు కలిసివస్తుంది. రావలసిన మొండి బాకీలు సైతం వసూలుకాగలవు. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. ఆలయాలను సందర్శిస్తారు. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ఒత్తిడి అధికం. మీ హోదా నిలబెట్టుకోవటానికి ధనం బాగా వెచ్చిస్తారు. 
 
వృషభం: ఆర్థికలావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా అధిగమిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. రాజకీయాల్లో వారికి ప్రత్యర్థులు పెరుగుతున్నారని గమనించండి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. స్త్రీలు షాపింగ్‌ల కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. బంధువులను కలుసుకుంటారు.
 
మిథునం: హోటల్, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. ఆలయాలను, నూతన ప్రదేశాలను సందర్శిస్తారు. బంధువులను కలుసుకుంటారు. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. విద్యార్థులకు చురుకుదనం లోపించడంతో పాటు ఇతర వ్యాపకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
కర్కాటకం: ఉన్నతస్థాయి అధికారులకు కిందస్థాయి సిబ్బందితో ఇబ్బందులు తప్పవు. ప్రింటింగ్ రంగాల వారికి అక్షర దోషం వల్ల చికాకులు తప్పవు. స్త్రీలకు స్కీమ్‌లు, ప్రకటనల వల్ల మోసపోయే ఆస్కారం వుంది. జాగ్రత్త వహించండి. వాయిదా పడిన పనులు పునఃప్రారంభిస్తారు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది.
 
సింహం: ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. ఆర్థిక లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. ట్రాన్స్‌పోర్ట్,  ఎక్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల్లో వారికి కలిసిరాగలదు. వాహన చోదకులకు ఊహించని చికాకులు తలెత్తుతాయి. ఆకస్మిక ఖర్చులు ఎదురుకావడంతో చేబదుళ్లు, రుణయత్నాలు చేస్తారు. 
 
కన్య: రావలసిన ధనం చేతికి అందడంతో పొదుపు పథకాల దిశగా మీ ఆలోచనలుంటాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు ఒత్తిడి అధికం. ఒక కార్యం నిమిత్తం ఆకస్మిక ప్రయాణం తప్పదు. మీ శ్రీమతి ప్రోత్సాహంతో కొత్త యత్నాలు మొదలెడతారు. మీ ప్రత్యర్థుల విమర్శలు, కుతంత్రాలు ధీటుగా ఎదుర్కొంటారు. 
 
తుల: ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. ఏజెన్సీలు, లీజు, నూతన కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. ప్రముఖులతో చర్చలు, సిఫార్సులు ఫలిస్తాయి. స్థిరచరాస్తుల క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి.
 
వృశ్చికం: సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. కుటుంబ సమస్యలు మెరుగుపడతాయి. స్త్రీలు చుట్టుపక్కల వారితో, పనివారలతో లౌక్యంగా వ్యవహరించవలసి వుంటుంది. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు తప్పదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఓర్పు, ఏకాగ్రత ఎంతో ముఖ్యం.
 
ధనస్సు: ఏదైనా విలువైన వస్తువు అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. తలపెట్టిన పనుల్లో జాప్యం వల్ల నిరుత్సాహం తప్పదు. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. పీచు, నార, ఫోమ్, లెదర్ వ్యాపారస్తులకు మందకొడిగా వుండును. లాయర్లకు, ఆడిటర్లకు, డాక్టర్లకు శుభప్రదంగా వుండగలదు.
 
మకరం: ప్రైవేట్ సంస్థల్లోని వారి నిర్లక్ష్యం, మతిమరుపు వల్ల యాజమాన్యం కోపతాపాలకు గురికావలసి వస్తుంది. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. విదేశీ ప్రయాణాలకై చేయు ప్రయత్నాల్లో సఫలీకృతులౌతారు. ఇంజనీరింగ్, ఆడిట్ రంగాల వారికి గుర్తింపు లభిస్తుంది. మీ సోదరి మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
కుంభం: వస్త్ర, బంగారం, వెండి, లోహ, వ్యాపారులకు, పనివారలకు చికాకులు తప్పవు. కీలకమైన వ్యవహారాల్లో భాగస్వాముల నుంచి వ్యతిరేకత, పట్టింపులు ఎదురవుతాయి. వైద్యులకు ఏకాగ్రత అవసరం. ధనియాలు, ఆవాలు, పసుపు, ఎండుమిర్చి, నూనె వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు అనుకూలంగా వుండగలదు.
 
మీనం: ముఖ్యుల కోసం ధనం బాగుగా వెచ్చించాల్స వుంటుంది. చిట్స్, ఫైనాన్సు రంగాల వారికి ఒత్తిడి తప్పదు. ప్రేమికులు తొందరపాటు చర్యలు ఇబ్బందులకు దారితీస్తాయి. భాగస్వామిక చర్చలు, ఉత్తర ప్రత్యుత్తరాలతో మెలకువ వహించండి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి పనిభారం, చికాకులు తలెత్తుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి సేవా టిక్కెట్లు దొరుకుతున్నాయి, త్వరపడండి