రొయ్యల పకోడి ఎలా చేయాలో తెలుసా?

Webdunia
శుక్రవారం, 29 మార్చి 2019 (21:29 IST)
సీ ఫుడ్ శరీరానికి చాలా మేలు చేస్తుంది. చికెన్, మటన్ కన్నా కూడా సీఫుడ్ చాలా మంచిదంటారు వైద్యులు. సీఫుడ్‌లో రొయ్యలంటే ఇష్టపడని వాళ్లుండేరేమో. రొయ్యలతో కేవలం కూర, బిర్యానీలే కాదు టేస్టీ స్నాక్స్ కూడా చేసుకోవచ్చు. సాయంత్రం సమయంలో రొయ్యలతో చేసిన పకోడీ పిల్లలకు స్నాక్స్‌లా పెడితే చాలా ఇష్టంగా తింటారు. మరి రొయ్యలపకోడి ఎలా చేయాలో చూద్దాం.
 
కావాల్సిన పదార్థాలు:
రొయ్యలు - 20,
శనగపిండి - రెండు టీస్పూనులు,
బియ్యప్పిండి - ఒక టీస్పూను,
మొక్క జొన్న పిండి - ఒక టీస్పూను, 
ఉల్లిపాయల తరుగు - ఒక కప్పు,
కొత్తిమీర తరుగు - అరకప్పు, 
కరివేపాకు తరుగు - పావు కప్పు,
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూను, 
కారం - ఒక టీస్పూను,
పసుపు - చిటికెడు,
నిమ్మరసం - ఒక స్పూను, 
ఉప్పు, నూనె - సరిపడినంత.
 
తయారు చేసే విధానం 
రొయ్యలు బాగా కడిగి ఒక బౌల్‌లో వేసుకోవాలి. ఆ బౌల్‌లో శనగపిండి, బియ్యంపిండి, మొక్కొజొన్న పిండి, కారం, ఉప్పు, పసుపు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలపాలి. కాస్త నీరు చేర్చి మళ్లీ కలపాలి. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని అరగంట పాటూ పక్కన అలానే పక్కన పెట్టుకోవాలి. 
 
అనంతరం కళాయిలో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెని వేసి వేడిచేయాలి. పకోడీలు లాగా నూనెలో వేసి వేయించాలి. గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి తీసేయాలి. వీటిని టమాటా సాస్‌తో తింటే భలే రుచిగా ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఢిల్లీ యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ దారుణ హత్య.. కారణం ఎవరంటే?

జూన్ 12 నుంచి కాదు.. జూన్ 15 నుంచి స్కూల్స్ పునః ప్రారంభం

కోలివింగ్ ప్రియుడి వేధింపులు తాళలేక ఐదవ అంతస్థు నుంచి దూకేసింది..

Elon Musk: భారత సంతానోత్పత్తి రేటు పడిపోయింది.. స్పేస్ఎక్స్ సీఈఓ మస్క్

వాట్సాప్ నుంచి ట్రిపుల్ తలాక్ ఇచ్చిన కువైట్ భర్త.. పోలీసులకు భార్య ఫిర్యాదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha: త్రిషకు పెళ్లైందా... మెడలో ఆ మంగళసూత్రం ఏంటి... ఎవరు కట్టారు?

స్టార్స్ ఉంటేనే పెద్ద సినిమా కాదు.. : కమల్ హాసన్

తిరుచ్చి నుంచి రాఘవ లారెన్స్ పోటీ.. జూన్ 11న ప్రకటిస్తానని హింట్

నా చెస్ట్, నడుము భాగాలను ఫోకస్ చేసే షాట్స్ వద్దు : జాన్వీ కపూర్

Ram 23: రామ్ పోతినేని 23 చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా తిరు ఖరారు

తర్వాతి కథనం
Show comments