Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సమోసా... చికెన్ సమోసా... అబ్బ నోట్లో నీళ్లు...

Advertiesment
Chicken Samosa
, గురువారం, 28 మార్చి 2019 (17:39 IST)
సమోసా.. ఈ మాట వింటేనే పిల్లలకు నోట్లో నీరూరుతుంటాయి. అలా బయటికి వెళ్లి వేడి వేడి సమోసాలను తింటామంటూ మారాం చేస్తుంటారు. కాని బయట దొరికే సమోసాల వల్ల అనారోగ్యం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇలా జరగకూడదంటే.. ఇంట్లోనే సమోసాలను తయారుచేసుకోవడమే ఉత్తమం, ఆరోగ్యం కూడా. అందులోనూ చికెన్ అంటే అమితంగా ఇష్టపడే పిల్లలకు.. చికెన్‌తో.. ఇంట్లోనే సమోసా చేసిపెడితే.. ఆరోగ్యానికి ఆరోగ్యం... ఆనందానికి ఆనందం. రుచికరమైన, నోరూరించే చికెన్ సమోసాను తయారు చేయడం కూడా చాలా సులభం. అదెలాగో చూద్దాం.
 
కావల్సిన పదార్థాలు... 
 చికెన్‌ (కీమా) - 1 కప్పు, 
కారం పొడి- 2 స్పూన్లు, 
గరం మసాల - స్పూను,
పసుపు - అర స్పూను, 
సోంపు పౌడర్‌ - స్పూను, 
ఉప్పు - తగినంత, 
మిరియాల పొడి - అరస్పూను 
ఉల్లిపాయలు - 3 (సన్నగా తరిగినవి), 
నూనె - వేయించడానికి సరిపడా,
అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ - 2 స్పూన్లు, 
పచ్చిమిర్చి - 3 (సన్నగా తరిగినవి) 
గుడ్డు - 1, 
గోధుమపిండి - కప్పు, 
మైదాపిండి - 2 కప్పులు 
ధనియాల పొడి - 2 స్పూన్లు, 
నిమ్మకాయ -1 
నీళ్లు - సరిపడా, 
కొత్తిమీర - కొద్దిగా, 
 
తయారీ విధానం.. 
ముందుగా కడాయిలో నూనె వేసి వేడి చేయాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులోనే అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో చికెన్‌ కీమాను జోడించాలి. తర్వాత అందులోనే సోంపు పౌడర్‌, మిరియాలు, ధనియాలపొడి, పసుపు, ఉప్పు, గరం మసాలా, కారం, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి మొత్తం మిశ్రమాన్ని కలపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. 
 
తర్వాత ఒక పెద్ద వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో.. గోధుమ పిండి, మైదాపిండి, గుడ్డు, చిటికెడు ఉప్పు వేసి మెత్తగా కలిపి 15 నిమషాలు అలాగే పెట్టాలి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని చిన్నచిన్న చపాతీల మాదిరిగా చేసుకోవాలి. వాటి మధ్యలో ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్న చికెన్‌ మిశ్రమాన్ని నింపి.. సమోసాల మాదిరిగా ఒత్తుకోవాలి. అదనపు రుచి కోసం మిశ్రమంలో నిమ్మరసం, కొత్తిమీర వేసుకోవచ్చు. 
 
ఈ విధంగా తయారుచేసుకున్న సమోసాలను.. నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకూ వేయించుకోవాలి. అంతే.. వేడివేడి చికెన్ సమోసా రెడీ. ఈ సమోసాలను వేడివేడిగా సాస్‌తో తింటే ఆహా ఏమి రుచి అనుకోవాల్సిందే.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బరువును తగ్గించే అలసందలు..