Webdunia - Bharat's app for daily news and videos

Install App

రొయ్యల బిర్యానీ..?

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (11:32 IST)
కావలసిన పదార్థాలు:
బాస్మతి బియ్యం - 1 కేజీ
రొయ్యలు - కేజీన్నర
పెరుగు - 200 గ్రా
నిమ్మరసం - 3 స్పూన్స్
కారం - 20 గ్రా
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 100 గ్రా
ఉప్పు - 50 గ్రా
గరంమసాలా - 20 గ్రా
నూనె - 100 గ్రా
వేగించిన ఉల్లి ముక్కలు - 30 గ్రా
జీడిపప్పు - కొద్దిగా
కొత్తిమీర - 15 గ్రా
పుదీనా - 15 గ్రా
బిర్యానీ ఆకులు - 5 గ్రా
డాల్డా - 150 గ్రా
నీళ్లు - 5 లీటర్లు
 
తయారీ విధానం:
ముందుగా రొయ్యలను శుభ్రం చేసుకుని ఆపై ఒక గిన్నెలో రొయ్యలు వేసి వాటిలో నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరంమసాలా, వేయించిన ఉల్లి ముక్కలు, పెరుగు, కొత్తిమీర, పుదీనా తరుగు, ధనియాల పొడి, నూనె వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని రెండు నుండి మూడు గంటలు పాటు అలానే ఉంచుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలో నీళ్లు పోసి అందులో గరం మసాలా, బిర్యానీ ఆకులు వేయాలి. నీళ్లు ఉడుకుపట్టాక కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేయాలి. బియ్యం సగం ఉడికాక నీళ్లు వంపేయాలి. అన్ని వైపులా సమంగా ఉన్న గిన్నె తీసుకుని అందులో ముందుగా నానబెట్టుకున్న రొయ్యల్ని ఒక పొరలా వేయాలి. వాటిపైన సగం ఉడికించిన బిర్యానీ రైస్‌ను పొరలా పరవాలి. పైన నెయ్యి వేయాలి. 
 
ఈ గిన్నెను ఒక తవాపై ఉంచి సన్నటి మంటమీద 25 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత గిన్నె మీద మూత పెట్టి ఆవిరి బయటకు రాకుండా గిన్నెను, కొత్తిమీర, పుదీనాల తరుగు, జీడిపప్పు, వేగించిన ఉల్లిపాయ ముక్కలతో అలంకరించాలి. అంతే... ఘుమఘుమలాడే రొయ్యల బిర్యానీ రెడీ.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మద్యం మత్తులో చోరీకి వెళ్లి ఇంట్లోనే నిద్రపోయిన దొంగ

వంట గ్యాస్ సిలిండర్ పేలుడు : ఒకరు మృతి - ముగ్గురికి గాయాలు

వివేకా హత్య కేసు విచారణ పూర్తయింది : సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఐ

భార్యాభర్తలపై కాల్పులు జరిపిన ప్రేమికుడు.. నన్ను కాదని అతడితో వెళ్తావా?

జమ్మూకాశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా ?వార్తలను ఖండించిన సీఎం ఒమర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yogi babu: కొత్త వాళ్లు ఇండస్ట్రీకి రావాలి, అప్పుడే అభివృద్ధి : బ్రహ్మానందం

Producers: సినీ కార్మికుల బెదిరింపులపై నిర్మాతలు కీలక నిర్ణయం

Fedaration: ఫెడరేషన్ నాయకుల కుట్రతోనే సినీ కార్మికులకు కష్టాలు - స్పెషన్ స్టోరీ

ఆది శేషగిరి రావు క్లాప్ తో వేణు దోనేపూడి నిర్మిస్తున్న చిత్రం ప్రారంభం

ఫిట్ నెస్ కోసం యువత సరైన సప్లిమెంట్స్ ఎంచుకోవాలి : సోనూ సూద్

తర్వాతి కథనం
Show comments