కావలసిన పదార్థాలు:
బియ్యం - 2 కప్పులు
చక్కెర - ఒకటిన్నర కప్పు
కొబ్బరి పాలు - పావు లీటరు
కొబ్బరి తురుము - 1 కప్పు
మంచినీళ్లు - రెండున్నర కప్పులు
తయారుచేసే విధానం:
ముందుగా బియ్యం బాగా కడిగి నాలుగు గంటల పాటు నానబెట్టాలి. తరువాత నీళ్లు వార్చి రెండు కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి. ఆపై బాణలిలో కొబ్బరిపాలు, చక్కెర వేసి ఉడికించాలి. చక్కెర బాగా కరిగేవరకు ఉంచి అనంతరం స్టవ్ కట్టేయాలి. దాదాపు 5 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. కరిగిన పంచదారను ఉడికించి ఉంచిన అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి.
ఆ తరువాత అన్నం మిశ్రమంలో కొబ్బరి తురుము వేసి కలిపి కేక్ తయారు చేసే పాత్రని తీసుకుని దాని అడుగున నెయ్యి రాయాలి. అందులో స్పూన్ కొబ్బరి తురుము, స్పూన్ చక్కెర చల్లి.. దానిమీద అన్నం మిశ్రమాన్ని వేసి మౌల్డ్‌ను ఓవెన్ పెట్టాలి. 180 డిగ్రీల వేడి దగ్గర 45 నిమిషాల పాటు బేక్ చేయాలి. ఈ లోపు కొబ్బరి తురుమును, చక్కెరను బాణలిలో వేసి కాసేపు వేయించాలి. తరువాత ఓవెన్ లోంచి కేకు తీసి.. వేయించిన కొబ్బరి తురుము, చక్కెర మిశ్రమాన్ని చల్లాలి. అంతే... కొబ్బరి రైస్ కేక్ రెడీ.