Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలం.. వేడి వేడి చికెన్ గారెలు తయారీ ఎలా..?

Webdunia
శుక్రవారం, 30 జులై 2021 (21:17 IST)
Garelu
సాధారణ జలుబుకు చికెన్ మెరుగ్గా పనిచేస్తుంది. చికెన్ తినడం రక్తపోటును నిర్వహించడానికి సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన బరువును నియంత్రిస్తుంది. చికెన్ కొలెస్ట్రాల్‌ను నియంత్రించగలదు. ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాంటి చికెన్‌తో గారెలు ట్రై చేస్తే.. 


చికెన్ :  పావు కేజీ. (బోన్‌లెస్)
జీడిపప్పు : 100 గ్రా.
శనగపిండి: 200 గ్రా.,
పుదీనా : చిన్న కట్ట,
కొత్తిమీర : అరకట్ట,
ఉప్పు, నూనె : తగినంత
బియ్యం పిండి : 50 గ్రా.,
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : ఒక టీస్పూన్
కారం : 2 టేబుల్‌స్పూన్స్
పసుపు : పావు టీస్పూన్
 
తయారీ విధానం.. 
ముందుగా చికెన్‌ను బాగా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత కీమాలా చిన్న ముక్కలుగా కట్ చేయాలి. జీడిపప్పును పేస్ట్‌లా చేసుకోవాలి. చికెన్ కీమాలో జీడిపప్పు పేస్ట్, అల్లం, వెల్లుల్లి పేస్ట్ ఉప్పు, కారం, పసుపు, పుదీనా, కొత్తిమీర, శెనగపిండి, బియ్యం పిండి కొంచెం నీరు పోసి బాగా కలుపుకోవాలి. దీన్ని కాసేపు పక్కన పెట్టాలి. మరోవైపు కడాయిలో నూనె పోసి వేడి చేయాలి. చికెన్ మిశ్రమాన్ని చిన్న వడల్లా చేసి నూనెలో వేయించుకోవాలి. వీటిని అలాగే తినేయొచ్చు. లేదా ఏదైనా చట్నీతో తిన్నా టేస్టీగా ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

మాంసం తినే విషయంలో గొడవ.. ప్రియురాలు ఆత్మహత్య

సరోగసీ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ అనుమానాస్పద మృతి!!

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..

చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments