Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జీడిపప్పు టేస్ట్‌గా వున్నాయని అధికంగా తింటే ఏమవుతుందో తెలుసా?

జీడిపప్పు టేస్ట్‌గా వున్నాయని అధికంగా తింటే ఏమవుతుందో తెలుసా?
, శనివారం, 13 ఫిబ్రవరి 2021 (19:58 IST)
జీడిపప్పు కనబడితే చాలు గబుక్కున నోట్లో వేసుకుని పరపరమంటూ నమిలేయాలనిపిస్తుంది. ఐతే పచ్చివి తినడం కంటే వాటిని వేయించుకుని తింటే మంచిదని నిపుణులు చెపుతున్నారు. ఇకపోతే జీడిపప్పులో అధిక ఆక్సలేట్ కంటెంట్ ఉంటుంది. ఎక్కువ పరిమాణంలో తిన్నప్పుడు, ఇవి మూత్రపిండాలపై ప్రభావం చూపి నష్టం కలిగిస్తాయి. అంతేకాదు ఇవి ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం లేకపోలేదు. ముడి జీడిపప్పు అసురక్షితమైనవి, ఐతే కాల్చిన జీడిపప్పు మరింత రుచికరమైనదే కాకుండా అవి సురక్షితమైనవి కూడా.
 
జీడిపప్పుతో ప్రయోజనాలు
జీడిపప్పులో సున్నా కొలెస్ట్రాల్ ఉంటుంది. కనుక గుండెకు ఎలాంటి హాని చేయదు. మెగ్నీషియం నిల్వలు కూడా అధికంగా ఉండటంతో ఎముకలు పుష్టికి ఇవి దోహదపడుతాయి. మన శరీరానికి సుమారు 300 నుంచి 750 మిల్లీగ్రాముల మెగ్నీషియం అవసరమవుతుంది కనుక కాజు తీసుకుంటే మేలు.
 
ఇక రక్తపోటు(బీపి) ఉన్నవారు కూడా జీడిపప్పును తినేందుకు భయపడాల్సిన పనిలేదు. ఇందులో సోడియం శాతం తక్కువగానూ పొటాషియం నిల్వలు ఎక్కువగా ఉంటాయి.
 
కేన్సర్ సమస్యను అడ్డుకునే యాంటి ఆక్సిడెంట్లను జీడిపప్పు కలిగి ఉంది. సెలీనియమ్, మరియు విటమిన్ ఇ వంటివి ఉండటంతో ఇవి కేన్సర్ ను రాకుండా అడ్డుకుంటాయి.
 
ఐతే తినమన్నాం కదా అని ఎడాపెడా తినేయకూడదు. నియంత్రణ ఉండాలి. రోజుకు 5 నుంచి 10 వరకూ మాత్రమే జీడిపప్పులను తీసుకోవచ్చు. ఇదికూడా రెండు దఫాలుగా తింటే మంచిది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెరుగు తింటారు, అందులో ఏముందో తెలుసా? (video)