Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకు 350 కేలరీల కొవ్వు కరిగించుకుంటే రూ.10 లక్షలు (Video)

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2022 (12:01 IST)
ఇంటి నుంచి పని చేస్తే ఐటీ ఉద్యోగులకు ఓ కంపెనీ బ్రహ్మాండమైన ఆఫర్ ప్రకటించింది. వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులు బరువు పెరిగి అనారోగ్యం బారినపడుతున్నారు. ఇప్పటికే పలు అధ్యయనాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఈ నేపథ్యంలో తమ ఉద్యోగులు ఆరోగ్యంగా ఉండాలని భావించిన ఓ కంపెనీ ఓ మంచి ఆఫర్‌ను ప్రకటించింది. 
 
ఈ నేపథ్యంలో తమ ఉద్యోగులు ఆరోగ్యంగా ఉండాలని, ఎలాంటి అనారోగ్య సమస్యలు వారి దరి చేరకూడదని భావించిన ఆన్‌లైన్ బ్రోకరేజీ సంస్థ జెరోధా ఉద్యోగుల కళ్లలో సంతోషం నింపే ప్రకటన చేసింది. బరువు తగ్గించుకునే ఉద్యోగులకు రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ సీఈవో నితిన్ కామత్ తెలిపారు.
 
రోజుకు 350 కేలరీల కొవ్వును కరిగించుకున్న ఉద్యోగులకు వివిధ రకాల ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. తమ ఫిట్నెస్ ట్రాకర్ పరికరాల్లో ఉద్యోగులు రోజువారీగా ఎంత కొవ్వును కరిగించాల్సి ఉంటుందన్న పరిధిని ఏర్పాటు చేస్తామన్నారు. 
 
నిర్దేశిత కాలపరిమితిలో లక్ష్యాన్ని చేరుకున్న వారికి నెల రోజుల వేతనాన్ని బోనస్‌గా అందిస్తామన్నారు. అలా బరువు తగ్గిన ఉద్యోగుల మధ్య లక్కీ డ్రా నిర్వహించి రూ.10 లక్షల బహుమతిని అందిస్తామని వివరించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments