Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో మరో రవళి.. ప్రేమించలేదని పెట్రోల్ పోసి నిప్పంటించారు..

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (11:25 IST)
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ప్రేమించలేదన్న అక్కసుతో ఓ యువతిపై ప్రియుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే కేరళలో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. ప్రేమించమని, పెళ్లి చేసుకోమని వేధిస్తూ వెంటబడుతున్న ఒక యువకుడు చివరికి ఆ విద్యార్థినిపై పెట్రోలు పోసి నిప్పటించాడు.  ప్రస్తుతం 80 శాతం గాయాలతో బాధితురాలు ఆసుప్రతిలో మృత్యువుతో పోరాటాడుతోంది. కేరళలోని పాతానంతిట్టలో ఈ ఘటన జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కేరళలోని కుంబానాడ్ ప్రాంతానికి చెందిన అజిన్ రేజి మ్యాథ్యూ (20) అనే యువకుడు టాటా మెడికల్ సైన్సెస్‌లో విద్యాభ్యాసం చేస్తున్న కవిత విజయ్‌కుమార్ (18) అనే విద్యార్థిని ప్రేమించసాగాడు. కానీ, ఆ విద్యార్థిని మాత్రం మ్యాథ్యూను దూరంగా ఉంచసాగింది. దీంతో ప్రేమించుకుని పెళ్లి చేసుకుందామంటూ కవితను వేధించసాగాడు. పలు విధాలుగా బెదిరించాడు. అయినా నిరాకరించింది. 
 
దీంతో ఆగ్రహించిన మ్యాథ్యూ రెండు బాటిళ్లలో పెట్రోల్ నింపుకుని కవితతో గొడవకు దిగాడు. చివరకు పెట్రోలు పోసి నిప్పంటించి పారిపోయాడు. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అంతేకాదు సంఘటనా స్థలం నుంచి పారిపోతున్న నిందితుడిని పట్టుకుని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments