Webdunia - Bharat's app for daily news and videos

Install App

లెక్కింపు పూర్తికాకుండానే ఓటమిని అంగీకరించిన యశ్వంత్ సిన్హా

Webdunia
గురువారం, 21 జులై 2022 (21:53 IST)
భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము విజయం సాధించారు. ఈ నెల 18వ తేదీన జరిగిన రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 11 గంటల నుంచి చేపట్టారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత తుది ఫలితాలను ప్రకటించారు. ఇక్కడ విచిత్రమేమిటంటే.. ఈ ఓట్ల లెక్కింపు పూర్తికాకుండానే ఆమె సమీప ప్రత్యర్థి, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తన ఓటమిని అంగీకరించారు. 
 
గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. దాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అధికార పక్షానికి పూర్తి స్థాయిలో మెజారిటీ ఉందని తెలిసి కూడా విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన యశ్వంత్ సిన్హా ఓటు హక్కు కలిగిన ప్రజా ప్రతినిధులు ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలని విజ్ఞప్తి చేసిన విషయం తెల్సిందే. 
 
తాజా ఎన్నికల్లో ఓటమిని ఖరారు కాగానే విజేత ద్రౌపది ముర్ముకు ఆయన అభినందలు తెలిపారు. భారత రాష్ట్రపతిగా విధి నిర్వహణలో నిర్భయంగా, నిష్పక్షిపాతంగా నిర్ణయాలు తీసుకోవాలంటూ ఆయన ముర్ముకు సూచించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments