Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాష్ట్రపతి ఎన్నికల్లోనూ బేరసారాలకు దిగిన బీజేపీ : యశ్వంత్ సిన్హా

yashwanth sinha kamal nath
, శుక్రవారం, 15 జులై 2022 (09:02 IST)
దేశ ప్రథమ పౌరుడు ఎన్నికలను కూడా భారతీయ జనతా పార్టీ అతి సాధారణ ఎన్నికలుగా భావించి, ఈ ఎన్నికల్లో కూడా బేరసారాలకు దిగిందని ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఆరోపించారు. ఇందుకోసం ఆయన ఆపరేషన్ కమల్‌ను ప్రారంభించిందని తెలిపారు. 
 
ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం, రాజ్యసభ ప్రధాన కార్యదర్శి (రాష్ట్రపతి ఎన్నికకు ఆర్వో) ఈ వ్యవహారంపై విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. తనకున్న విశ్వసనీయ సమాచారం మేరకు.. ఈ ఆపరేషన్‌లో భాగంగా భాజపాయేతర శాసనసభ్యులకు పెద్దమొత్తంలో డబ్బులు అందజేస్తున్నారని ఆరోపించారు. 
 
'కమలం' భాజపా ఎన్నికల గుర్తు అన్న విషయం తెలిసిందే. గురువారం భోపాల్‌లో కాంగ్రెస్‌ శాసనసభ్యులతో భేటీ అనంతరం యశ్వంత్‌సిన్హా మీడియాతో మాట్లాడారు. 'ఈరోజు ఉదయం మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్తను చూసి నేను విస్తుపోయా. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 26 మంది గిరిజన ఎమ్మెల్యేలపై భాజపా కన్ను పడిందని, క్రాస్‌ ఓటింగుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నది ఆ వార్త సారాంశం' అన్నారు. 
 
ఆపరేషన్‌ కమల్‌కు సరైన పేరు 'ఆపరేషన్‌ మురికి' అని అభివర్ణించారు. ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు, ప్రతిపక్షాల నడుమ స్పర్థలు తెచ్చేందుకు భాజపా ఇటువంటి మురికి రాజకీయాలకు పాల్పడుతోందని సిన్హా ధ్వజమెత్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్య అక్రమ సంబంధం పెట్టుకోలేదనీ చంపి కాల్చి ఉడకబెట్టిన భర్త?