Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూత్రంతో కళ్లను సొంతం చేసుకున్న మహిళ..

ఠాగూర్
గురువారం, 26 జూన్ 2025 (18:36 IST)
ఆన్‌లైన్‌లో ఓ మహిళ చేసిన పని తీవ్ర దుమారం రేపుతోంది. ప్రతి రోజూ ఉదయం తన కళ్లను సొంత మూత్రంతో శుభ్రం చేసుకుంటానని చెబుతూ ఓ వీడియోను పంచుకోవడమే ఇందుకు కారణమైంది. ఈ వీడియో వైరల్ కావడంతో ఆరోగ్య నిపుణులు, సోషల్ మీడియా యూజర్లు మండిపడుతున్నారు. ఇలాంటి పనులు ఆరోగ్యానికి ప్రమాదకరమని వారు హెచ్చరిస్తున్నారు. 
 
నుపుర్ పిట్టీ అనే మహిళ తనను తాను 'మెడిసిన్- ఫ్రీ లైఫ్ కోచ్' (మందులు అవసరం లేని జీవిత శిక్షకురాలు)గా పరిచయం చేసుకుంది. ఈ వారం మొదట్లో ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. 'యూరిన్ ఐ వాష్ - ప్రకృతి ప్రసాదించిన ఔషధం' అనే క్యాప్షన్‌ను దానికి జోడించింది. ఈ వీడియోలో ఆమె తన మూత్రంతో కళ్లను శుభ్రం చేసుకోవడం కనిపించింది.
 
ప్రకృతి వైద్యం పేరిట ఇలాంటి విపరీత చర్యలకు పాల్పడటం సరికాదని పలువురు వ్యాఖ్యానించారు. ఇది అత్యంత ప్రమాదకరమని, కంటి ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి అశాస్త్రీయ పద్ధతులను ప్రోత్సహించవద్దని సూచిస్తున్నారు. శాస్త్రీయంగా నిరూపించబడని ఇలాంటి చిట్కాలను పాటించడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments